చిరు వ్యాపారికి ఐటీ శాఖ బిగ్ షాక్ వీడియో
కుర్జాలోని నయాగంజ్ ప్రాంతానికి చెందిన సుధీర్ అనే వ్యక్తి తన ఇంట్లోనే ఓ చిన్న కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ ఏడాది జూలై 10న అతనికి ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. అందులో అతని పేరు మీద ఢిల్లీలో ఆరు కంపెనీలు రిజిస్టర్ అయినట్లు వాటి ద్వారా 141 కోట్లకు పైగా విలువైన అమ్మకాలు జరిగినట్లు ఐటీ శాఖ నోటీసుల సారాంశం.
ఇది చూసి సుధీర్ కంగుతిన్నారు. దీనిపై స్పందించిన సుధీర్ నోటీసులు చూడగానే షాక్ అయ్యాడు. 2022లో కూడా తనకు ఇలాగే జరిగిందని ఐటీ శాఖ నోటీసులు వచ్చాయని తెలిపాడు. అప్పుడే ఐటీ అధికారులను కలిసి ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపానని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు తన పాన్ కార్డును మోసపూరితంగా ఉపయోగించి ఈ కంపెనీలను సృష్టించారని ఆయన ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇతరుల పాన్ కార్డు వివరాలను అక్రమంగా సంపాదించి వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరవడం, డమ్మీ కంపెనీలు సృష్టించడం, రుణాలు పొందడం లేదా పన్నులు ఎగవేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడిన బాధితులకు ఐటీ నోటీసులు లేదా లోన్ రికవరీ కాల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని, క్రెడిట్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
