ఇంత చిన్న వాషింగ్ మెషీన్ మీరెప్పుడూ చూసి ఉండరు

|

Oct 21, 2024 | 9:52 PM

భారతదేశానికి చెందిన సెబిన్ సాజీ అనే యువకుడు అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇతడు తన అసాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అద్భుతమైన ఆఫ్‌బీట్ గాడ్జెట్‌ను సృష్టించాడు. ప్రపంచంలోనే అతి చిన్న ఫంక్షనల్ వాషింగ్ మెషీన్ సృష్టించాడు. ఈ వాషింగ్‌ మెషీన్‌ పరిమాణం 1.28, 1.32, 1.52 అంగుళాలు కొలతలో మాత్రమే ఉంది.

ఇది 1990ల నాటి ప్రసిద్ధ హ్యాండ్‌హెల్డ్ బొమ్మ అయిన తమగోచి డిజిటల్ పెంపుడు జంతువు కంటే చిన్నది. సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ఇది సాధారణ వాషింగ్ మెషీన్‌లానే పనిచేస్తుంది. ఇప్పుడీ అతిచిన్న వాషింగ్ మెషీన్ గిన్నిస్ రికార్డు సాధించింది. గిన్నిస్ రికార్డు కోసం సాజీ దానిని డిజైన్, అసెంబుల్ చేసి ఆపై అది పనిచేస్తున్నట్టు ప్రదర్శించి చూపించాడు. అంటే వాష్, రిన్జ్‌, స్పిన్ వంటి అన్ని ఫంక్షన్లు పనిచేస్తున్నట్టు చూపించాడు. అతడు దానిని కొలిచేందుకు ప్రత్యేక డిజిటల్ కాలిపర్స్‌ను ఉపయోగించాడు. సెబిన్ తన వాషింగ్ మెషీన్‌కు సంబంధించి విడుదల చేసిన వీడియోలో అతడు.. చిటికెడు వాషింగ్ పౌడర్‌ను మెషిన్‌లో వేసి, చిన్ని చిన్ని క్లాత్‌ పీసెస్‌ అందులో వేసి, నీరు పోసి ఆన్ చేసాడు. అది సాధారణ వాషింగ్‌ మెషిన్‌లాగే సూపర్‌గా వాష్‌ చేసేసింది. దీంతో సెబిన్ ఇంజినీరింగ్ నైపుణ్యానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిని ఉపయోగించడం సాధ్యం కానప్పటికీ చూడ్డానికి సరదాగా ఉంటుంది. అందుకే ఈ వాషింగ్ మెషీన్‌ను చూసేందుకు జనం పోటెత్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూట్యూబ్‌లో స్లీప్‌ టైమర్‌ ఆప్షన్‌.. ఎలా పనిచేస్తుందంటే ??

Blinkit: బ్లింక్ ఇట్ ఐడియా అదిరిపోయిందిగా !!

చాట్‌జీపీటీ సాయంతో సీవీ.. చూసి షాకైన సీఈఓ

22 ఏళ్లుగా ఇలాగే ఉన్నారు.. ఇంకా ఎన్నాళ్లిలా ??

సిడ్నీ బీచ్‌లో వింత ఘటన.. బీచ్‌ మూసివేత..

 

Follow us on