Mother killed: ఇదేం పిచ్చిరా అంటూ.. పెళ్లి చేయడం లేదని తల్లిని చంపిన కొడుకు.
రాను రానూ మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. సునితమైన విషయానికే దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయడం లేదని కన్న తల్లినే హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ దారుణం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో చోటుచేసుకుంది. బండమైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ కొడుకు, కూతురుతో కలిసి ఉంటోంది.
రాను రానూ మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. సునితమైన విషయానికే దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయడం లేదని కన్న తల్లినే హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ దారుణం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో చోటుచేసుకుంది. బండమైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ కొడుకు, కూతురుతో కలిసి ఉంటోంది. పదిహేను సంవత్సరాల క్రితమే భర్త చనిపోవడంతో పాత ఇనుప సామాగ్రి క్రయవిక్రయాలతో జీవనాన్ని సాగిస్తోంది వెంకటమ్మ. కుమార్తె శైలజకు పెళ్లి అయ్యింది. కొడుకు ఈశ్వర్ ప్రమాదావశాత్తు ఒక చేయి పోగొట్టుకుని ఇంట్లో ఉంటున్నాడు. ఈశ్వర్‌కు ఒక చేయి లేకపోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన ఈశ్వర్.. తల్లితో తరుచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలోనే మరోసారి తల్లి వెంకటమ్మతో ఘర్షణకు దిగి.. తన బంధువైన పర్వతం రాము సాయంతో ఆమె గొంతు కోసి హతమార్చాడు. అంతేకాదు తల్లి రెండు కాళ్లను నరికేసి.. కాళ్ల కడియాలను ఎత్తుకెళ్లారని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈశ్వర్ ప్రవర్తనలో తేడా కనిపించడాన్ని వారు గమనించారు. చివరికి అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు ఈశ్వర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...