బర్సానాలో వింత హోలీ.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!

|

Mar 22, 2024 | 7:30 PM

దేశంలో పలు పండుగలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయ రీతిలో జరుగుతుంటాయి. హోలీ విషయంలోనూ ఇదే విధంగా కనిపిస్తుంటుంది. హోలీ పండుగకు ఉత్తరప్రదేశ్‌లోని బర్సానా చాలా ప్రసిద్ధి. ఇక్కడ రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను ఆడతారు. ఇక్కడి మహిళలంతా పక్కనే ఉన్న నందగావ్ గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం కర్రలు పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లు ఊరిలోకి అడుగు పెట్టగానే లాఠీలతో తరుముతూ రంగులు పులుముతూ పరుగులు పెడుతూ సందడి చేస్తారు.

దేశంలో పలు పండుగలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయ రీతిలో జరుగుతుంటాయి. హోలీ విషయంలోనూ ఇదే విధంగా కనిపిస్తుంటుంది. హోలీ పండుగకు ఉత్తరప్రదేశ్‌లోని బర్సానా చాలా ప్రసిద్ధి. ఇక్కడ రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను ఆడతారు. ఇక్కడి మహిళలంతా పక్కనే ఉన్న నందగావ్ గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం కర్రలు పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లు ఊరిలోకి అడుగు పెట్టగానే లాఠీలతో తరుముతూ రంగులు పులుముతూ పరుగులు పెడుతూ సందడి చేస్తారు. శ్రీ రాధే శ్రీ కృష్ణ హోలీ పాటలను పాడతారు. ఇక బృందావన్‌లో హోలీ వేడుకల్లో భాగంగా స్త్రీలు సరదాగా పురుషులను లాఠీలతో కొడతారు. పురుషులు ఆ లాఠీ దెబ్బలు తమపై పడకుండా డాలు లేదా షీల్డ్‌తో తమను తాము రక్షించుకుంటారు. ద్వాపర యుగంలో కృష్ణుడు రాధకు రంగులు పులిమి పారిపోతుంటే, అమ్మాయిలంతా ఇలా లాఠీలు పట్టుకుని ఆయన్ని వెంబడించారని, అదే ఇప్పుడు సాంప్రదాయంగా కొనసాగుతుందని ఇక్కడి ప్రజలు చెబుతారు. అయితే, ఇక్కడ లాఠీలతో కొట్టడమనేది సరదా సాంప్రదాయం మాత్రమే. ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వకుండా కొడతారు. కృష్ణుడి జన్మ స్థలమైన మథురలో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు, పండుగ చివరి 16 రోజులు, సంప్రదాయక పద్ధతులలో కృష్ణుడిని పూజిస్తారు. మథుర, బృందావన్, బర్సానాలలో హోలీ జరుపుకొన్నట్లు హత్రాస్, ఆలీగర్, ఆగ్రాలో కూడా అదే విధంగా జరుపుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 19 వేలకే అమెరికా-ఇండియా విమాన టికెట్‌ !! షాకవుతున్న నెటిజన్లు

Anand Mahindra: ఆ సంఘటన నా మతి పోగొట్టింది.. అదే నాకు గుణపాఠమైంది

క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కి అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌

పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్ట్‌పై ఉగ్రదాడి

డీప్‌ఫేక్‌పై ఇటలీ ప్రధాని కొరడా.. రూ.90 లక్షల పరువు నష్టం దావా