ఆకట్టుకుంటున్న కదంబ గణపతి.. అమ్మవారికి ఇష్టమై పుష్పాలతో రూపొందిన గణేషుడు

Updated on: Aug 31, 2025 | 3:48 PM

వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు పూజలందుకునేందుకు ఆ లంబోదరుడు వివిధ రూపాలలో కొలువుదీరాడు. పర్యావరణ హితం కోరి పలుచోట్ల భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేస్తే.. కొందరు వివిధ రకాల వస్తువులతో, భిన్న రూపాలలో తీర్చిదిద్దారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ గణపతి విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది.

ఎందుకంటే ఈ గణపతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కదంబ పుష్పాలతో తీర్చిదిద్దారు. కదంబ కుసుమ ప్రియా అని లలితా అమ్మవారిని స్తుతిస్తాం.. అంతేకాదు ఈ పుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పురాణాల్లోనూ ఈ కదంబ వృక్షానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఎన్నో ఔషధాలు కలిగిన మొక్కగానూ ఈ కదంబ వృక్షానికి పేరుంది. తెల్లని తెలుపుతో ఈ పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. మొగ్గగా ఉన్నప్పుడు ఇవి ఆకుపచ్చని రంగుతో బంతుల మాదిరిగా ఉంటాయి. క్రమంగా పసుపుపచ్చగా మారి, చివరిగా తెలుపు వర్ణంతో పూబంతిలా మారుతుంది. ఈ పుష్పం ఆకారంలోనే కాదు సువాసనలోనూ ప్రత్యేకమైనవే. వర్షాకాలంలో ఎక్కువగా విరగబూసే ఈ పూలు లక్ష్మీ పూజలో ప్రధానంగా నిలుస్తాయి. అంతటి విశిష్టమైన కదంబ పూలతో వినాయకుని రూపొందించి పూజలు చేస్తున్నారు, శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరువంక గ్రామ ప్రజలు. ఉద్దానం యూత్ క్లబ్‌ వారు ఏటా భిన్న రూపాలలో గణపతిని ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాది కదంభం పుష్పాలతో తీర్చిదిద్దిన గణనాథుడి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ విగ్రహాన్ని దర్శించేందుకు సమీప గ్రామాల నుండి కూడా ప్రజలు తరలివస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో