Corona Effect: పురుషుల వీర్యంపై కరోనా ప్రభావం.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ నిజాలు..!
కరోనా తగ్గినప్పటికీ సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారిపై ఓ అధ్యనంలో మరిన్ని ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. చాలా మంది కొవిడ్ బారిన పడి..
కరోనా తగ్గినప్పటికీ సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారిపై ఓ అధ్యనంలో మరిన్ని ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. చాలా మంది కొవిడ్ బారిన పడి.. కోలుకుంటున్నప్పటికీ దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని తాజా నివేదికలో తెలిసింది. అంతేకాదు కరోనా వైరస్ పురుషుల వీర్యం పైనా ప్రభావం చూపుతోందని.. వీర్యం నాణ్యత దెబ్బతింటోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. పాట్నా ఎయిమ్స్‌కు చెందిన పరిశోధకులు కొవిడ్ సోకిన 30 మంది పురుషులపై పరీక్షలు నిర్వహించారు. మంగళగిరి, ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు. వీర్య ప్రమాణం, చలనశీలత, శుక్రకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ఇది ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది తెలియలేదని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..