Young man on Train: కదులుతున్న రైలుపై ఆ యువకుడు ఏం చేసాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో.

Young man on Train: కదులుతున్న రైలుపై ఆ యువకుడు ఏం చేసాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Jan 26, 2023 | 9:43 AM

రైలు ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో అప్రమత్తంగా లేకపోతే అంతే ప్రమాదకరం కూడా. అందుకే రైల్వే అధికారులు తరచూ హెచ్చరికలు చేస్తూ ఉంటారు. రైలు కదులుతున్నప్పుడు ఎక్కడం


రైలు ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో అప్రమత్తంగా లేకపోతే అంతే ప్రమాదకరం కూడా. అందుకే రైల్వే అధికారులు తరచూ హెచ్చరికలు చేస్తూ ఉంటారు. రైలు కదులుతున్నప్పుడు ఎక్కడం, దిగడం చేయొద్దని, పట్టాలపైనుంచి నడవొద్దని. కానీ ఇటీవల సోషల్‌ మీడియా బాగా వాడకంలోకి వచ్చిన తర్వాత అందరూ రకరకాల విన్యాసాలు చేస్తూ లైక్‌లు కోసం నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ నగరం మధ్యలో రైల్వే ట్రాక్‌పై చాలా వేగంగా రైలు వెళ్తోంది. ఆ రైలు టాప్‌పై ఇద్దరు యువకులు ప్రమాదకర స్థితిలో డాన్స్‌ చేస్తూ స్టంట్స్‌ చేశారు. ఆ సమయంలో వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఎలాంటి భయం లేకుండా డాన్స్‌ చేశారు. ఈ వీడియో న్యూయార్క్‌లో షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను పాప్‌ఓక్లాక్‌ అనే ఐడీతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను 11 వేలమందికి పైగా వీక్షించారు. వందలాదిమంది వీడియోను లైక్‌ చేస్తూ రకరకాల కామెంట్లు చేసారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి విన్యాసాలు చాలా ప్రమాదమని, ప్రాణం విలువ తెలుసుకొని మసలుకోవాలని హెచ్చరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

UK’s PM office Pongal: వాహ్వా..! యూకే ప్రధాని కార్యాలయంలో పొంగల్ విందు భోజనాలు..! ఖండాలు దాటినా తెలుగు సంప్రదాయం..

Wife Murder: వీడేం మొగుడు.. భార్య అందంగా ఉందని చంపేసిన భర్త.. పెళ్లైన ఆరు నెలలకే..!

TOP 9 ET News: NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే! | డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా.!

Published on: Jan 26, 2023 09:43 AM