Traffic Rules: అలా డ్రైవ్ చేసే వారికి.. ట్రాఫిక్‌ కెమెరా చూస్తోంది. జైలు తప్పదు జాగ్తత్త.!

|

Aug 11, 2024 | 8:51 PM

ఎహే.. అదంతా ఎవరు తిరిగొస్తాడు.. ఇలా ఒక్కడుగు రాంగ్‌రూట్‌లో వెళితే పోలా అని బండిని తిప్పేస్తున్నారా? ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కునే దానికంటే వంద పెనాల్టీ అయినా సరే కట్టేద్దాం అని రాంగ్‌రూట్‌ వెతుక్కుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి ఇది మీ లాంటి వారి కోసమే. ఇకపై పెనాల్టీ గినాల్టీ కుదరదట. రాంగ్‌ రూట్‌లో వెళితే ఏకంగా జైలుకేనట. రాంగ్‌రూట్‌లో వెళితే ఎఫ్‌ఐఆర్‌ తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.

ఎహే.. అదంతా ఎవరు తిరిగొస్తాడు.. ఇలా ఒక్కడుగు రాంగ్‌రూట్‌లో వెళితే పోలా అని బండిని తిప్పేస్తున్నారా? ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కునే దానికంటే వంద పెనాల్టీ అయినా సరే కట్టేద్దాం అని రాంగ్‌రూట్‌ వెతుక్కుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి ఇది మీ లాంటి వారి కోసమే. ఇకపై పెనాల్టీ గినాల్టీ కుదరదట. రాంగ్‌ రూట్‌లో వెళితే ఏకంగా జైలుకేనట. రాంగ్‌రూట్‌లో వెళితే ఎఫ్‌ఐఆర్‌ తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. రాంగ్‌రూట్‌లో వెళ్లి ప్రమాదాలకు కారణమైతే..జైలు శిక్షకూడా పడుతుందంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ ట్రై కమిషనరేట్ల పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో పాటు ర్యాష్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ వంటి ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతిరోజూ సగటున 10 నుంచి 20 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ కనీసం ఒకరిద్దరు మృత్యువాత పడుతున్నారు. రాంగ్‌రూట్‌లో వెళ్లేవారి వల్లే ఇతర వాహనదారులు ప్రమాదాల బారన పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు వేసినా.. వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దీంతో కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దం అయ్యారు.

రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ చేసే వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఇంతకుముందు లేదు. మొదటి సారిగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తొలిసారిగా ఈ సంవత్సరం మేలో ఈ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో కమిషనరేట్‌ వ్యాప్తంగా రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేసిన 250మందికి పైగా గుర్తించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేసే వాహనదారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కెమెరాల ద్వారా రాంగ్‌రూట్‌ వెళ్లే వారిని గుర్తించి, వాహనదారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.