పిల్లలు ఐస్ క్రీం అడగ్గానే కొనిచ్చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..
హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్స్ వ్యవహారం మరిచిపోక ముందే నకిలీ ఐస్‌క్రీమ్స్ బయటపడ్డాయి. నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఎస్.ఓ.టీ. మాదాపూర్ పోలీసులు దాడి చేసి, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఐదు సంవత్సరాలుగా...
హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్స్ వ్యవహారం మరిచిపోక ముందే నకిలీ ఐస్‌క్రీమ్స్ బయటపడ్డాయి. నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఎస్.ఓ.టీ. మాదాపూర్ పోలీసులు దాడి చేసి, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఐదు సంవత్సరాలుగా ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నాడు శ్రీనివాస రెడ్డి. ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై దాడులు చేసిన ఎస్‌ఓటీ పోలీసులు.. పది లక్షల రూపాయల విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 13న హైదరాబాద్ శివారులోనే నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రం గుట్టురట్టైన విషయం చూశాం. రాజేంద్రనగర్ పరిధి సులేమాన్‌నగర్‌లో SOT పోలీసులు జరిపిన దాడుల్లో దిమ్మదిరిగే విషయాలు వెలుగుచూశాయి. చాక్లెట్ల తయారీలో హానికర కెమికల్స్ గుర్తించారు. లీటర్ల కొద్దీ కెమికల్ బాటిల్స్, రంగు డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గ్లూకోజ్ లిక్విడ్, సిట్రిక్ యాసిడ్ పౌడర్, ఆరెంజ్ లిక్విడ్ ప్లేవర్, పాలిష్ పౌడర్, స్వీట్ ఆయిల్ లాంటి కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తయారైన చాక్లెట్లను బేగంబజార్‌లో హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి సిటీలోని అనేక చిన్నషాపులకు సరఫరా అవుతున్నాయి ఈ చాక్లెట్స్. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకూ సప్లై జరుగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుదైన కోతులు చైనాకు తరలింపు.. అందుకేనా ??
ఇద్దరు హీరోల ముద్దుల హీరోయిన్.. తను ఎవరో తెలుసా ??
Pawan Kalyan: సెట్‌లో అడుగుపెట్టిన గ్యాంగ్ స్టర్..
NTR30: ఇట్స్ కన్ఫర్మ్.. తారక్ యుద్దం ఆ బాలీవుడ్ హీరోతోనే..