IBM Layoffs: 7 నిమిషాల మీటింగ్.. ఉద్యోగులకు షాక్.! టెక్ కంపెనీలో లే ఆఫ్‌లు..
టెక్ కంపెనీల్లో కృత్రిమ మేధని అందిపుచ్చుకునేందుకు మళ్లీ లేఆఫ్‌లు మొదలుపెట్టాయి. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం తమ సంస్థలో కొంతమందికి ఉద్వాసన పలికింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డివిజన్లలో లేఆఫ్‌లు ప్రకటించింది. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాది మందిని తొలగించాయి ఐటీ కంపెనీలు. అయితే, కేవలం ఏడు నిమిషాల సమావేశంలో తొలగింపులపై ప్రకటన రావడంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు.
టెక్ కంపెనీల్లో కృత్రిమ మేధని అందిపుచ్చుకునేందుకు మళ్లీ లేఆఫ్‌లు మొదలుపెట్టాయి. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం తమ సంస్థలో కొంతమందికి ఉద్వాసన పలికింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డివిజన్లలో లేఆఫ్‌లు ప్రకటించింది. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాది మందిని తొలగించాయి ఐటీ కంపెనీలు. అయితే, కేవలం ఏడు నిమిషాల సమావేశంలో తొలగింపులపై ప్రకటన రావడంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జొనాథన్ అదాషేక్ ఇటీవల సమావేశం నిర్వహించి.. మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాల్లో లేఆఫ్‌లు చేస్తు్న్నామని ప్రకటించినట్లు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎంతమందిని తొలగించారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీనిపై ఐబీఎం ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. రానున్న ఏళ్లలో చాలా ఉద్యోగాల స్థానంలో కృతిమ మేధను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గతేడాది కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకోసం కొత్త నియామకాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. రానున్న ఐదేళ్లలో కంపెనీలో దాదాపు 30 శాతం ఉద్యోగుల స్థానంలో ఏఐని తీసుకురానున్నట్లు చెప్పారు.
ఇందుకోసం మానవ వనరుల వంటి విభాగాల్లో నియామకాలను తగ్గించడం లేదా నిలిపివేయడం చేస్తామని ప్రకటించారు. ఐటీఎం ఇప్పటికే గతేడాది పలు విభాగాల్లో వేలాది మందిని తొలగించింది. ఐబీఎం సహా పలు ప్రముఖ కంపెనీల్లో ఈ ఏడాది కూడా లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. 2024లో ఇప్పటివరకు 200లకు పైగా సంస్థలు దాదాపు 50వేల ఉద్యోగాల కోతలు ప్రకటించినట్లు Layoffs.fyi వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.