ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో

Updated on: Sep 04, 2025 | 12:40 PM

మనిషి జీవితంలో పెళ్లి ఒక కీలక ఘట్టం. పెళ్ళితో ఇద్దరు వ్యక్తుల జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఆనందమైన దాంపత్య జీవితం పెళ్ళితోనే ప్రారంభం అవుతుంది. అప్పటివరకు వేరువేరుగా జీవించిన ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా సాగే ప్రయాణానికి పెళ్లి నాంది అవుతుంది. అందుకే పెద్దా గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఈ వేడుకను బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటారు.

ప్రస్తుత కాలంలో కొందరు స్తోమతుకు మించి అప్పులు చేసి మరి పెళ్ళిళ్లు చేసి ఆ తర్వాత అప్పు తీర్చలేక తిప్పలు పడుతున్నారు. అయితే ఇద్దరు ఐఏఎస్ లు మాత్రం అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకొని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కేవలం రెండువేల రూపాయలతో పెళ్లి చేసుకున్న ఇద్దరు ఐఏఎస్ ల వివాహం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది రెండేళ్ల క్రితం జరిగినా, ఇంకా, ఈ   పెళ్లి వీడియో వైరల్ అవుతూనే ఉంది. తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ మౌనిక చత్తీస్ గఢ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి యువరాజ్ మర్మతులు 2022 బ్యాచ్ కు చెందినవారు. మౌనిక ఫార్మకాలజీ పూర్తి చేశాక సివిల్స్ చేశారు. ఇక రాజస్థాన్ కు చెందిన యువరాజ్ సివిల్ ఇంజనీరింగ్ చేసి కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జాబ్ చేసిన తర్వాత సివిల్స్ ని ఎంచుకున్నారు. 2022 లో ముసోరిలో ట్రైనింగ్ లో ఉన్న టైంలో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో 2023లో వీరిద్దరూ సింపుల్ గా కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం కేవలం రెండువేల రూపాయల ఖర్చుతో సింపుల్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి పూల దండలు మార్చుకొని మిఠాయిలు పంచి పెట్టారు. ప్రస్తుతం ఈ ఆదర్శ జంట రెండో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ పెళ్లి జరిగిన తీరును గుర్తుచేసుకుంటూ తమ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లి అంటే ఒక కమిట్మెంట్. కలకాలం తోడుగా ఉంటామని ఒకరికొకరు ఇచ్చుకునే మాట అని దీనికి అనవసర ఖర్చులు అవసరం లేదని వీరి పెళ్లి వీడియో ప్రూవ్ చేస్తుంది. ఈ పెళ్లి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం :

భారీ వర్ష సూచన..వచ్చే 24 గంటల్లో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో

మేం భారత్‌కు తిరిగి వచ్చేస్తాం వీడియో

Published on: Sep 04, 2025 11:35 AM