వేగంగా దూసుకెళ్తున్న కారు.. ఒక్కసారిగా

Updated on: Oct 15, 2025 | 8:04 PM

హనుమకొండ శివారు రింగురోడ్డుపై కారు బోల్తా కొట్టింది. అతివేగంగా వెళ్తున్న కారు అకస్మాత్తుగా నడిరోడ్డుపై బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ దుర్ఘటనలో ఎయిర్ బెలూన్స్ సకాలంలో ఓపెన్ అవడంతో కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.. అకస్మాత్తుగా బ్రేక్ కొట్టడమే ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించారు.

ఈ ప్రమాదం చింతగట్టు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగింది. హైదరాబాదు నుండి వరంగల్ వైపు వెళ్తున్న TS 09FG 7495 నెంబర్ గల కారు చింతగట్టు సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. కారుకు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బోల్తా పడింది.. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అయ్యాయి. వారంతా సురక్షితంగా బయట పడ్డారు. బోల్తాపడ్డ కారు పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం తప్పదని భావించారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు వెంటనే అక్కడికి చేరుకొని కారులో ఉన్నవారిని బయటకు తీశారు. కారు పక్కకు తొలగించి వారిని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళికి ముందు ఇలా చేయండి..ఇంటికున్న దరిద్రం పారిపోతుంది

మ్యాన్‌ ఈటర్‌ మళ్లీ వచ్చింది.. రైతును ఈడ్చుకెళ్లి

టెక్కీలకు షాక్ H-1B హైరింగ్ ఆపేసిన TCS

వరుడి గొంతెమ్మ కోర్కెలు వివాహం రద్దు చేసుకున్న వధువు

బ్యాంక్‌కు చిన్నారులు..! లోన్‌ కావాలి.. సైకిల్‌ కొనుక్కుంటాం