రైలు నుండి జారిపడిన యువకుడు.. క్షణంలో..

Updated on: Oct 29, 2025 | 4:34 PM

రైలు ప్రయాణికులు రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. రైలు ఆగిన తర్వాత దిగాలి. కానీ కొందరు రైలు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. హైదరాబాద్‌ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడు కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి అదుపు తప్పి జారి పడిపోయాడు.

అక్కడే విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు అప్రమత్తమవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అక్టోబరు 26 రాత్రి జరిగింది. వరంగల్‌కు చెందిన సాదుల మణిదీప్ బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. జనరల్‌ టికెట్ తీసుకున్న అతడు, పొరపాటున ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలోకి ఎక్కిపోయాడు. కొద్దిసేపటికే తన పొరపాటు తెలుసుకున్న మణిదీప్, రైలు కదిలిపోతున్న సమయంలో కిందకు దిగేందుకు ప్రయత్నించి కాలుజారి పడిపోయాడు. అదృష్టవశాత్తు అక్కడే విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవింద రావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుస్మిత అప్రమత్తమై వెంటనే స్పందించారు. ఇద్దరూ మణిదీప్‌ను రైలు చక్రాల కిందకు వెళ్లిపోకుండా వేగంగా పక్కకు లాగి రక్షించారు. వీరి అప్రమత్తతను రైల్వే అధికారులు ప్రశంసించారు. రైల్వే సిబ్బంది అలెర్ట్ గా ఉండడం వల్లే మణిదీప్‌ ప్రాణాలతో బయటపడ్డాడని కాచిగూడ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అన్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడకూడదని, రైలు నడుస్తున్న సమయంలో ఎక్కడం–దిగడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే మణిదీప్ ప్రాణాలు కోల్పోయి ఉండేవాడని ఆయన తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఈ దున్నపోతు ధర రూ.23 కోట్లట !! ఈ గుర్రం ధర రూ.15 కోట్లట

Kurnool bus tragedy: కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్

లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టింది

క్యాన్సర్ రోగుల కోసం కదిలిన ఒడిశా కేశదాత హరప్రియ

వీధి కుక్కల ఆకలి తీర్చి.. సొంత ఖర్చుతో వ్యాక్సిన్లు వేయిస్తున్న ఒడిశా వాసి