ఇండియాలోనే అత్యంత కాస్ల్టీ కారు కొన్న హైదరాబాదీ !! ధర తెలిస్తే షాక్ !!

|

Dec 21, 2022 | 7:27 PM

ఇండియాలో ఖరీదైన కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అలాంటి శ్రీమంతుల కోసమే విదేశీ కార్ల సంస్థలు ఇండియాలో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.

ఇండియాలో ఖరీదైన కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అలాంటి శ్రీమంతుల కోసమే విదేశీ కార్ల సంస్థలు ఇండియాలో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. తాజాగా దేశంలోనే అత్యంత ఖరీదు కలిగిన కారును హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. రీసెంట్‌గా ఇండియాలో లాంచ్ చేసిన మెక్‌ లారెన్‌ సంస్థ తన తొలి డీలర్‌షిప్‌ను ముంబైలో ప్రారంభించింది. ఆ సంస్థకు చెందిన సూపర్ కారు మెక్ లారెన్ 765 LTని ప్రదర్శనకు ఉంచింది. దీన్ని ఖరీదు అక్షరాల 12 కోట్ల రూపాయలు. ఇంత ఖరీదు చేసే సూపర్ కారును మొదటిసారిగా సొంతం చేసుకున్నారు హైదరాబాద్‌కి చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్. హైదరాబాద్‌కి చెందిన బిజినెస్‌మెన్ నసీర్‌ఖాన్‌కి లగ్జరీ కార్లు అంటే ఇష్టం. అందుకే ఖరీదైన కార్లు మార్కెట్‌లోకి రాగానే ముందుగా తానే కొనుగోలు చేసి వాటిని తన గ్యారేజ్‌లో ఉంచుకుంటున్నారు. ఇప్పటికే నసీర్‌ఖాన్ దగ్గర ఫెరారీ, లంబోర్గిని, రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. మెక్‌లారెన్‌ కార్ల సంస్థను ఇండియాలో ఇన్ఫినిటీ గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ బ్రాండ్ తన మొత్తం పోర్ట్‌ఫోలియోను భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మొదటి కస్టమర్‌గా హైదరాబాదీకి అవకాశం కల్పించింది. మెక్‌లారెన్ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన వేగవంతమైన కన్వర్టిబుల్‌లలో ఇది ఒకటి. ఇది కూపే వెర్షన్ వంటి అత్యంత ఏరోడైనమిక్ డిజైన్‌తో రూపొందించారు. ఒకరకంగా చెప్పాలంటే రోడ్లపై పక్షిలా ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓర్నీ.. ఈ వయసులో మీకిదేం పిచ్చిరా సామీ !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్‌ వీడియో

రైల్వే కూలీ నుంచి ఐఏఎస్‌గా.. వెరీ ఇంట్రెస్టింగ్‌ !!

పొట్ట కూటికోసం చిన్నారుల విన్యాసాలు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

సర్కార్‌ దవాఖానలో జడ్జి ప్రసవం.. ఆదర్శంగా జస్టిస్‌ షాలిని

ప్రయాణికుల బంపర్ ఆఫర్.. గుంజీలు తీస్తే ఫ్రీగా బస్సు టిక్కెట్‌ !!

 

Published on: Dec 21, 2022 07:27 PM