Hyderabad Biryani: దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..

|

Apr 13, 2024 | 8:12 PM

బిర్యానీ అంటే ఇష్టప‌డని వారెవరు చెప్పండి. బిర్యానీ పేరు చెబితేనే నోరూరుతుంది కొందరికి. ఆ వాస‌న‌కే క‌డుపు నింపేసుకుంటారు ఇంకొందరు. హైదరాబాద్‌ బిర్యానీ ప్రత్యేకతే అది మరి. దేశం మొంత్తంగా హైదరాబాద్‌ బిర్యానీ టాప్‌లో ఉంటుంది. విదేశీయులు కూడా ఈ బిర్యానీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇతర రాష్ట్రాల ప్రజలు నగరానికి వస్తే కచ్చితంగా బిర్యానీ తినకుండా వెనుతిరిగి వెళ్లరు.

బిర్యానీ అంటే ఇష్టప‌డని వారెవరు చెప్పండి. బిర్యానీ పేరు చెబితేనే నోరూరుతుంది కొందరికి. ఆ వాస‌న‌కే క‌డుపు నింపేసుకుంటారు ఇంకొందరు. హైదరాబాద్‌ బిర్యానీ ప్రత్యేకతే అది మరి. దేశం మొంత్తంగా హైదరాబాద్‌ బిర్యానీ టాప్‌లో ఉంటుంది. విదేశీయులు కూడా ఈ బిర్యానీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇతర రాష్ట్రాల ప్రజలు నగరానికి వస్తే కచ్చితంగా బిర్యానీ తినకుండా వెనుతిరిగి వెళ్లరు. అంతటి రుచికరమైన బిర్యానీని రంజాన్‌ మాసం సందర్భంగా నగరవాసులు తెగ లాగించేశారట. ఈ రంజాన్‌ నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా పది లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా వెల్లడించింది.

ఈ ఏడాది రంజాన్‌ మాసం మార్చి 11న ప్రారంభమై ఏప్రిల్‌ 11 గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 8 వరకూ దేశవ్యాప్తంగా ఫుడ్‌ డెలివరీ ఆర్డర్ల వివరాలను వెల్లడించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. సాధారణ రోజుల కంటే ఇవి 15 శాతం ఎక్కువ అని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా బిర్యానీ ఆర్డర్లలో టాప్‌లో నిలిచింది హైదరాబాద్‌. నెల రోజుల్లోనే 10 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. బిర్యానీతోపాటు హలీమ్‌ ఆర్డర్లలోనూ నగరవాసులు రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఈ నెలలో ఏకంగా 5.3 లక్షల హలీమ్‌ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. రంజాన్‌ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్‌ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..