యువతి అనారోగ్యాన్ని మంత్రంతో పోగొడతానన్నాడు.. చివరికి..

Updated on: Oct 07, 2025 | 7:44 PM

మంత్రాలకు చింతకాయలు రాలవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. చింతకాయలే రాలనిది ఇంక అనారోగ్యాలెలా తగ్గుతాయండి..! టెక్నాలజీ యుగంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలను వదలడం లేదు జనాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి మంత్రంతో ఆరోగ్యం కుదుటపరుస్తానని చెప్పిన ఓ మాయగాడి మాటలు నమ్మి యువతిని అతనికి అప్పగించారు ఆమె తల్లిదండ్రులు.

ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బిగ్‌ షాకిచ్చింది. మహారాష్ట్ర పూణె నుంచి ఓ కుటంబం బ్రతుకుతెరువుకోసం హైదరాబాద్‌కి వచ్చి పాతబస్తీ ప్రాంతంలోని నవాబ్ సాహెబ్ కుంటలో నివసిస్తున్నారు. ఆ కుటుంబానికి చెందిన యువతి ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. అది గమనించిన ఓ బాబా తాను మంత్రం వేసి యువతి ఆరోగ్యం బాగుచేస్తానని మాయమాటలు చెప్పి నమ్మబలికాడు. ఈ క్రమంలో రోజూ ఆ ఇంటికి వస్తుండేవాడు బాబా. అతని మాటలు నమ్మిన యువతి తల్లిదండ్రులు ఆ యువతిని అతని వద్దకు తరచూ పంపించసాగారు. ఈ క్రమంలో ఓ రోజు యువతిని దర్గాకు తీసుకెళ్లి అక్కడ ఓ ప్రత్యేక మంత్రం వేస్తే పూర్తిగా నయమైపోతుందని నమ్మబలికి యువతిని తనతో తీసుకెళ్లి ఆమెను వివాహం చేసుకున్నాడు. రోజులు గడుస్తున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సడన్‌గా ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతూ తాను మేజర్‌ని అని, ఆ బాబాను ప్రేమించానని.. స్వచ్ఛందంగా అతనిని వివాహం చేసుకున్నానని చెప్పింది. అంతేకాదు సమయం, సందర్భం చూసుకుని నిర్ణయం తీసుకున్నానని, అంతా తన ఇష్టపూర్వకంగానే జరిగిందంటూ క్లారిటీ ఇచ్చింది. యువతి స్వచ్ఛందంగా వెళ్లిందని తెలిసిన వెంటనే మిస్సింగ్ కేసును పోలీసులు క్లోజ్‌ చేశారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే బాబాకి ఇది వరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చేసేది లేక లబోదిబోమంటున్నారు. తమ కూతురు తిరిగి తమ దగ్గరికి రావాలని కోరుతున్నారు. మాయ మాటలు చెప్పి మంత్రాల పేరిట యువతిని ప్రభావితం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓరి బుడ్డోడా.. మ్యాగీ కోసం ఎంత పనిచేశాడు

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై పీఎఫ్ సేవలు మరింత సులభం

అపర కుబేరుడు.. ఈ ఆటోవాలా.. నెలకు రూ. 3 లక్షల ఆదాయం

Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం.. ఇక పర్యాటకం పరుగులే

కంత్రీ పాక్‌ కన్నింగ్‌ ప్లాన్‌.. మన చాబహర్‌ పోర్టు పక్కనే అమెరికా పోర్టు