Old Stepwell: వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా గువ్వలకుంట్ల గ్రామంలోని పురాతన మెట్ల బావి కొత్తగా అందరి దృష్టిని ఆకర్షించింది. మన పూర్వీకులు ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిల్పకళా సంపద బయటి ప్రపంచానికి తెలిసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన యుగంధర్ అనే యువకుడు బావి దుస్థితిని చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. వీడియోను కొందరు మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేయగా నారా లోకేష్ రీట్వీట్ చేశారు.
చరిత్రలో భాగమైన ఈ మెట్ల బావి నిరాదరణకు గురై రూపు రేఖలు కోల్పోయింది. బావిలో ఎటు చూసినా మద్యం సీసాలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ దుస్థితిలో మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుమారు 80 మంది నల్లమల అంచుల్లోని కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చేరుకొని శ్రమదానం చేశారు. చెత్తా చెదారాన్ని తొలగించి మురుగు నీటిని మోటార్ల ద్వారా బయటికి తోడి బావికి కొత్త సొగసులు అందించారు. చారిత్రక మెట్ల బావిని పునరుద్ధరించి ఎన్నో జీవరాసులకు ఆయువు కేంద్రంగా మార్చారు. శిల్ప సంపదతో పాటు.. చరిత్రకారులు చెక్కిన నాటి శిలాక్షరాలను నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
పూర్వం రాజుల కాలంలో ఈ బావిని నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాలను బట్టి తెలుస్తుంది. శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే సమయంలో అక్కడ ఉండడానికి సేద తీరడానికి కూడా మఠాలు నిర్మించినట్లు గ్రామస్తులు తెలియజేశారు. మరోవైపు ఈ బావిలో నుంచి పూర్వం నీటిని తీసుకువెళ్లి గువ్వలకుంట్ల గ్రామంలో ఉన్న శివాలయంలో అభిషేకం చేసేవారని తెలుస్తోంది. బావిలో ఉన్న శిల్ప కళా సంపద ఏ మాత్రం చెక్కు చెదరలేదు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ బావికి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.