Finger in Salad: సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.! వీడియో.
ఇటీవల ఆన్‌లైన్ ఫుడ్‌లోనే కాదు, రెస్టారెంట్లలో వడ్డించే ఆహారంలోనూ నాణ్యత కనిపించడం లేదు. కస్టమర్స్‌కి వడ్డించే ఆహారంలో చిత్రి విచిత్రమైన వస్తువులు, కీటకాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ మహిళ ఆర్డర్ చేసిన సలాడ్‌లో ఏకంగా మనిషి వేలు వచ్చింది. దాంతో సదరు మహిళ షాకయింది. అమెరికాలోనా ఓ మహిళకు ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌లో ఆర్డరిచ్చిన సలాడ్‌లో మనిషి వేలు ఉందన్న విషయం గుర్తించిన ఆమె చివరకు రెస్టారెంట్ యాజమాన్యంపై కోర్టుకెక్కింది.
ఇటీవల ఆన్‌లైన్ ఫుడ్‌లోనే కాదు, రెస్టారెంట్లలో వడ్డించే ఆహారంలోనూ నాణ్యత కనిపించడం లేదు. కస్టమర్స్‌కి వడ్డించే ఆహారంలో చిత్రి విచిత్రమైన వస్తువులు, కీటకాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ మహిళ ఆర్డర్ చేసిన సలాడ్‌లో ఏకంగా మనిషి వేలు వచ్చింది. దాంతో సదరు మహిళ షాకయింది. అమెరికాలోనా ఓ మహిళకు ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌లో ఆర్డరిచ్చిన సలాడ్‌లో మనిషి వేలు ఉందన్న విషయం గుర్తించిన ఆమె చివరకు రెస్టారెంట్ యాజమాన్యంపై కోర్టుకెక్కింది. న్యూయార్క్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రీన్ విచ్‌కు చెందిన యాలిసన్ కోజీ ఏప్రిల్ 7న న్యూయార్క్‌లోని ప్రముఖ చాప్ట్ రెస్టారెంట్‌కు వెళ్లి సలాడ్ ఆర్డరిచ్చింది. అక్కడి సిబ్బంది సలాడ్‌ను ఆమెకు సర్వ్ చేశారు. ఆ సలాడ్ తింటున్న ఆమె తను మనిషి వేలును నమిలిన విషయాన్ని గుర్తించి ఒక్కసారిగా షాకైంది. ఆమె రెస్టారెంట్‌పై కోర్టులో కేసు దాఖలు చేసింది. కేసు వివరాల ప్రకారం, ఈ ఘటనకు ముందురోజు రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరు కూరలు తరుగుతుండగా ప్రమాదవశాత్తూ అతడి వేలు తెగింది. వెంటనే అక్కడున్న వారు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తెగిపడిన వేలు కూరగాయల్లో ఉండిపోవడంతో చివరకు అది సలాడ్‌లో కలిసింది. కాగా, స్థానిక ఆరోగ్య విభాగం అధికారులు రెస్టారెంట్‌పై ఇప్పటికే జరిమానా విధించింది. అయితే, ఘటన కారణంగా తనకు శారీరక మానసిక సమస్యలు వచ్చాయని బాధితురాలు తన పిటిషన్‌లో పేర్కొంది. తనకు రెస్టారెంట్ చెయిన్ నిర్వాహకులు నగదు రూపంలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.