వామ్మో.. ఆ రోజు వచ్చుంటే వీడియో

Updated on: Jun 29, 2025 | 12:36 PM

విశాఖలో ఓ పాము ఫారెస్ట్ అధికారులకు పరుగులు పెట్టించింది. యోగా డే ముగిసిన మరునాడు..సాగర్ నగర్ ఏరియాలో బయో టాయిలెట్స్ కోసం తీసిన గోతిలో ఓ పెద్ద రక్తపింజరి అటూఇటూ కదులుతూ కనిపించింది. ప్రపంచం గుర్తించే స్థాయిలో లక్షలాది మంది పాల్గొన్న యోగా డే మరునాడు ఈ అత్యంత విషపూరితమైన రక్త పింజరి కనిపించటం, దానిని సకాలంలో పట్టుకోవటంతో అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ బీచ్ రోడ్‌లో తలపెట్టిన యోగాంధ్ర ఈవెంట్ నేపథ్యంలో.. అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ ఏరియాకి అనుసంధానమై ఉన్న బీచ్ రోడ్ మీద దృష్టి సారించారు.

విశాఖలో ఓ పాము ఫారెస్ట్ అధికారులకు పరుగులు పెట్టించింది. యోగా డే ముగిసిన మరునాడు..సాగర్ నగర్ ఏరియాలో బయో టాయిలెట్స్ కోసం తీసిన గోతిలో ఓ పెద్ద రక్తపింజరి అటూఇటూ కదులుతూ కనిపించింది. ప్రపంచం గుర్తించే స్థాయిలో లక్షలాది మంది పాల్గొన్న యోగా డే మరునాడు ఈ అత్యంత విషపూరితమైన రక్త పింజరి కనిపించటం, దానిని సకాలంలో పట్టుకోవటంతో అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ బీచ్ రోడ్‌లో తలపెట్టిన యోగాంధ్ర ఈవెంట్ నేపథ్యంలో.. అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ ఏరియాకి అనుసంధానమై ఉన్న బీచ్ రోడ్ మీద దృష్టి సారించారు. ఈ మార్గంలో పాములు రాకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, పాములు వస్తే పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్‌నీ రంగంలోకి దించారు. అయితే, ఆ రోజు ఎలాంటి పాములూ కనిపించలేదు. అయితే, తాజాగా ఆ ఈవెంట్ కోసం బీచ్ మార్గంలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన బయో టాయిలెట్ల తరలింపు వేళ.. సాగర్ నగర్ వద్ద గల ఓ గుంతలో ఈ భారీ రక్తపింజరి కనిపించింది. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్స్ దానిని ఓ సీసాలో బంధించి.. సమీపంలోని కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలేశారు. మన దేశంలో గల అత్యంత విషపూరితమైన పాముల్లో రక్త పింజరి ఒకటి. ఇది కాటు వేసిన వెంటనే క్షణాల్లోనే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. దీన్ని కాటుక రేకుల పాము అని కూడా అంటారు. మనదేశంలో అత్యధిక పాము కాటు మరణాలకు కారణమైన నాలుగు విష సర్పాల్లో ఇదొకటి.

మరిన్ని వీడియోల కోసం :

దృశ్యం 3’ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..బ్లాక్ బ‌స్టర్ కాంబో రిపీట్‌..

నాగార్జున కాళ్లు మొక్కేది.. ఆ ఒక్కడికే వీడియో

ప్యారిస్‌ మ్యూజిక్ షోలో.. సిరంజిలతో దాడి వీడియో

Published on: Jun 28, 2025 08:24 PM