Kadapa: ఇంట్లో ఓ మూలన నక్కిన కొండచిలువ.. గ్రామస్థుల సమాచారంతో స్నేక్ క్యాచర్ ఎంట్రీ..

| Edited By: Ram Naramaneni

Aug 19, 2023 | 4:14 PM

కొండచిలువకు ఎటువంటి ప్రాణహాని లేకుండా పట్టుకున్నట్లు అటవీ సిబ్బంది తెలిపారు. గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా కొండచిలువను తరలించి.. శుక్రవారం రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో అడవిలో వదిలి పెట్టామన్నారు. అంత పెద్ద కొండచిలువ ఎటువంటి ప్రాణ నష్టం చేయకపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఏవైనా వన్యప్రాణుల జనవాసాల్లోకి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సూచిస్తున్నారు. వాటిని చంపవద్దని కోరుతున్నారు.

కడప జిల్లాలోని సిద్ధవటం మండలం వెలుగు పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో గ్రామంలోకి ఏడు అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. వెలుగుపల్లి ఎస్సీ కాలనీలో రమణమ్మ అనే మహిళ ఇంటిలో శుక్రవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో భయభ్రాంతులకు గురైన ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి కొండల చిలువను చూసి.. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి చేరుకున్న సిబ్బంది కడపకు చెందిన స్నేక్ క్యాచర్‌ను పిలిపించి దాన్ని బంధించారు. ఆపై కొండచిలువను సుదూరంగా తీసుకుని వెళ్ళి అటవీ ప్రాంతంలో వదిలేసారు. మీడియాతో అటవీ క్షేత్ర అధికారి బి కళావతి మాట్లాడుతూ గ్రామస్తులు నుంచి ఒక ఇంట్లో కొండ చిలువ ఉందని సమాచారం అందిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమై తమ సిబ్బందిని ఆ ప్రదేశానికి పంపించామని.. కడప నుండి స్నేక్ క్యాచర్ నటరాజన్‌ను పిలిపించి, కొండచిలువకు ఎటువంటి ప్రాణహాని లేకుండా పట్టుకున్నట్లు తెలిపారు. గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా కొండచిలువను తరలించి.. శుక్రవారం రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో అడవిలో వదిలి పెట్టామన్నారు. అంత పెద్ద కొండచిలువ ఎటువంటి ప్రాణ నష్టం చేయకపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Published on: Aug 19, 2023 04:12 PM