ఏటీఎం కొట్టేద్దామనుకున్నారు… నోట్లన్నీ కాలిపోయాయి

|

Dec 09, 2023 | 9:54 AM

బెంగళూరులోని ఏటీఎంను లూటీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్‌ కట్టర్‌తో దానిని తెరిచారు. అయితే ఏటీఎంలో భారీగా ఉన్న నగదు ఆ మంటలకు కాలిపోయింది. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం తెల్లవారుజామున నెలమంగళ ప్రాంతంలోని ఒక బిల్డింగ్‌ వద్ద ఉన్న బ్యాంకు ఏటీఎంలోని డబ్బును దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్‌ కట్టర్‌ తెచ్చి దానిని తెరిచారు.

బెంగళూరులోని ఏటీఎంను లూటీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్‌ కట్టర్‌తో దానిని తెరిచారు. అయితే ఏటీఎంలో భారీగా ఉన్న నగదు ఆ మంటలకు కాలిపోయింది. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం తెల్లవారుజామున నెలమంగళ ప్రాంతంలోని ఒక బిల్డింగ్‌ వద్ద ఉన్న బ్యాంకు ఏటీఎంలోని డబ్బును దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్‌ కట్టర్‌ తెచ్చి దానిని తెరిచారు. అయితే గ్యాస్‌ కట్టర్‌ ద్వారా వెలువడిన భారీ మంటలకు ఆ ఏటీఎంలోని కరెన్సీ కట్టలు కాలిపోయాయి. దొంగలు ఏటీఎం లోపలికి ప్రవేశించిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఏటీఎం మెషీన్‌ను తెరిచిన విషయాన్ని గుర్తించారు. వెంటనే బిల్డింగ్‌ యజమానిని అప్రమత్తం చేశారు. ఆ యజమాని ఏటీఎం వద్దకు చేరుకోగా ఆ దొంగలు గ్యాస్‌ కట్టర్‌ సామగ్రి వదిలి అక్కడి నుంచి పారిపోయారు. బ్యాంకు అధికారులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఏటీఎం లూటీకి ప్రయత్నించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లలతో నడుస్తున్న మహిళ.. వారిపై కూలిన ఇంటి పైకప్పు

వరకట్న పిశాచానికి యువ డాక్టర్‌ బలి

గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతం.. దిక్కుతోచని స్థితిలో పౌరులు

AMకి PMకి తేడా తెలియని వారు పీఎంవోను ఎలా నడుపుతారు ??

TOP 9 ET News: అనిమల్ కి ఐకాన్ స్టార్ షాకింగ్ రివ్యూ | దేవ కాదు..సలార్ వస్తోంది.. దిమ్మతిరిగిపోవాలి

 

Follow us on