WhatsApp stickers: మీ ఫొటోలతోనే వాట్సాప్ స్టిక్కర్లు.. విషెస్ చెప్పేయండి ఇలా.. మీరే స్పెషల్ గా..

|

Oct 09, 2022 | 6:23 PM

దసరా పండుగ శుభవేళ మీ బంధుమిత్రులకు అందమైన మీ ఫోటోలనే స్టిక్కర్లుగా ఉపయోగిస్తూ శుభాకాంక్షలు చెప్పవచ్చు. అదెలా అంటే..


వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా దసరా పండుగ శుభవేళ మీ బంధుమిత్రులకు అందమైన మీ ఫోటోలనే స్టిక్కర్లుగా ఉపయోగిస్తూ శుభాకాంక్షలు చెప్పవచ్చు. అదెలా అంటే.. వాట్సాప్ లో పర్సనల్ స్టిక్కర్లను తయారు చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ యాప్ తెరిచి బ్యాక్‌ గ్రౌండ్ రిమూవర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్ చేసి, గ్యాలరీ నుంచి మీరు స్ట్రైకర్‌గా మార్చాలనుకుంటున్న ఫోటోలను సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటో బ్యాక్ గ్రౌండ్ తీసేయాలి. తర్వాత ఫొటోను పీఎన్జీ ఫార్మేట్ లో సేవ్ చేయండి. వీటిని గ్యాలరీలో సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్‌లో వీటిని స్టిక్కర్‌లుగా పంపించడానికి మరొక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పర్సనల్‌ స్టిక్కర్స్‌ ఫర్‌ వాట్సాప్‌ (Personal Stickers for WhatsApp) పేరుతో ఒక యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేసి, ఫోన్ గ్యాలరీలో సేవ్ చేసిన అన్ని స్టిక్కర్‌లను సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంతే ఎంచక్కా వాట్సాప్ చాటింగ్‌ ద్వారా వీటిని పొంది అందరికీ పంపించుకోవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Published on: Oct 09, 2022 06:23 PM