Gold Rules: ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?

|

Oct 16, 2024 | 12:49 PM

బంగారం.. తరాలు మారినా వన్నె తగ్గని సంపద. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా కూడా బంగారంపై అందరికీ అంత మక్కువ. అయితే ఒకప్పటితో పోల్చితే నేడు పసిడిని చూసే వైఖరి మారింది. ముఖ్యంగా నేటి తరం దాన్ని కేవలం ఆభరణంగా మాత్రమేగాక, ఓ తెలివైన పెట్టుబడి సాధనంగా చూస్తోంది. అయితే డబ్బులు ఉన్నాయి కదా అని ఎంత పడితే అంత బంగారం కొనిపడేస్తామంటే దానికుండే రూల్స్‌ దానికున్నాయి మరి.

బంగారం అంటే ఇష్టపడనివారు దాదాపు ఉండరు. పెళ్లి రోజు, పుట్టిన రోజు, పండగలు.. ఇలా ప్రత్యేక రోజుల్లో కొంత బంగారాన్ని కొనే ఆనవాయితీని చాలామంది పాటిస్తారు. అయితే నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉండాలో తెలుసా..? అదేంటి మన డబ్బులతో మనం బంగారం కొనుగోలు చేస్తున్నాం కదా. మరి దానికి ఎందుకు పరిమితులు అనుకుంటున్నారా? ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి బంగారం దిగుమతి, ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది. అయితే చట్టబద్ధమైన ధ్రువపత్రాలు కలిగి ఉంటే మాత్రం వ్యక్తులు కోరుకున్నంత బంగారాన్ని కలిగి ఉండవచ్చు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోతే ఇంట్లో ఎంత బంగారం ఉండాలో ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో దంపతులు, పిల్లలు ఉంటే ఒక్కొక్కరు ఎంతమేరకు బంగారం కలిగి ఉండాలో ప్రభుత్వం నిర్దిష్టంగా చెప్పింది. పెళ్లైన పురుషుడు గరిష్ఠంగా 100 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. పెళ్లయిన మహిళ వద్ద గరిష్ఠంగా 500 గ్రాముల బంగారం వరకు ఉండొచ్చు. ఇక పెళ్లికాని పురుషుడు గరిష్ఠంగా 100 గ్రాములు, పెళ్లి కాని యువతి దగ్గర 250 గ్రాముల బంగారం ఉండొచ్చు. ఎలాంటి ధృవ పత్రాలు లేకుండానే ఈ గోల్డ్ ను ఇంట్లో పెట్టుకోవచ్చన్నమాట. ఇంట్లో దంపతులు, ఇద్దరు పెళ్లికాని కుమార్తెలు ఉంటే ఆ కుటుంబం గరిష్ఠంగా 1,100 గ్రాముల బంగారాన్ని కలిగి ఉండొచ్చు. ఇందుకు ఎలాంటి ధ్రుపపత్రాలు ఉండాల్సిన అవసరం లేదు. అంతకుమించి బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవాలంటే మాత్రం తగిన ధ్రుపత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 16, 2024 09:30 AM