Indians in Pak jails: పాకిస్థాన్‌లో ఎంతమంది భారతీయ ఖైదీలు ఉన్నారో తెలుసా..?

|

Jul 03, 2022 | 3:25 PM

దాయాది దేశం పాకిస్థాన్.. భారతీయులకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. తమ దేశ జైళ్లలో దాదాపు 682 మంది భారత సంతతికి చెందినవారు ఖైదీలుగా ఉన్నట్లు తెలిపింది.


దాయాది దేశం పాకిస్థాన్.. భారతీయులకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. తమ దేశ జైళ్లలో దాదాపు 682 మంది భారత సంతతికి చెందినవారు ఖైదీలుగా ఉన్నట్లు తెలిపింది. వీరిలో 49 మంది పౌరులు, 633 మంది మత్స్యకారులు పాక్‌ కస్టడీలో ఉన్నట్లు వెల్లడించింది. అదేవిధంగా భారత్‌ జైళ్లలో 461 మంది పాకిస్తానీ ఖైదీలు ఉన్నట్లు పేర్కొంది. వీరిలో 45 పాక్‌ పౌరులు కాగా, 116 మంది మత్స్యకారులని భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాన్సులర్ యాక్సెస్‌పై 2008 ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఏడాదికి రెండు సార్లు అంటే.. జనవరి 1, జూలై 1 తేదీల్లో ఖైదీల వివరాలను ఇరు దేశాలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోందిపాక్‌లో జైలు శిక్ష పూర్తి చేసుకున్న 536 మంది భారతీయ మత్స్యకారులు, 3 పౌరులను విడుదల చేసి స్వదేశానికి పంపించాలని, పాకిస్తాన్ చెరలో ఖైదీలుగా ఉన్న 105 మంది మత్స్యకారులు, 20 మంది పౌరులకు తక్షణమే కాన్సులర్ యాక్సెస్ అందించాలని పాకిస్తాన్‌ను కోరింది. ఆయా ఖైదీల జాతీయత ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని, అన్ని విషయాలకు భారత్‌ కట్టుబడి ఉందని, అదేవిధంగా పాక్‌ ఖైదీల జాతీయత నిర్ధారణను అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్‌ను కోరింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?