Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ఎంతవరకు వచ్చింది.? వీడియో..

|

Sep 16, 2024 | 9:26 AM

ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు ఆపరేషన్‌ అండర్ వాటర్‌ కొనసాగుతోంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు శ్రమించినా పడవలను కట్‌ చేయలేకపోయారు. దాంతో, విశాఖ నుంచి తీసుకొచ్చిన స్కూబా డైవర్స్‌ను రంగంలోకి దించారు. అండర్‌ వాటర్‌లోకి దిగిన స్కూబా డైవర్స్‌.. పడవలను కట్‌ చేసే పనిలో పడ్డారు. అత్యాధునిక పరికరాలను వినియోగిస్తూ బోట్లను కట్‌ చేస్తున్నారు స్కూబా డైవర్స్‌.

పడవల తొలగింపు ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది. పడవలు చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో తొలగింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. నిన్నంతా ఒక్క బోట్‌ను కట్‌ చేయడంపైనే పనిచేశారు. అయినా కూడా నాలుగు మీటర్ల మేర మాత్రమే కట్‌ చేయగలిగారు. ఇవాళ 10మంది బృందం.. విడతల వారీగా నదిలోకి వెళ్లి ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. స్కూబా డైవింగ్ సూట్, ఆక్సిజన్ సిలిండర్లు ధరించిన డైవింగ్ టీమ్‌.. నదిలోపల 12 అడుగుల లోతులోకి వెళ్లి భారీ పడవను ముక్కలుగా కట్‌ చేస్తున్నారు.

బ్యారేజ్‌ దగ్గర బోట్ల తొలిగింపు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బోటుకు లోపలివైపు రెండు పేట్లు ఉండడంతో కటింగ్‌కు ఎక్కువ సమయం పడుతోందన్నారు. ఇప్పటకే పనులు 70 శాతం పూర్తి అయ్యాయని.. మిగిలింది కూడా రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు మంత్రి నిమ్మల

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on