Diamond: కూలీకి కోటిన్నర వజ్రం దొరికింది.! రాత్రికి రాత్రే జీవితం మారిపోయింది.
మధ్యప్రదేశ్లోని పన్నాలో మరో విలువైన వజ్రం బయటపడింది. స్వామిదిన్ పాల్ అనే కూలీ మరో ముగ్గురితో కలిసి సర్కోహా గ్రామంలో ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్వామిదిన్కు 32.80 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ భారీ వజ్రం విలువ రూ.1.5 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో స్వామిదిన్ పాల్ రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.
మధ్యప్రదేశ్లోని పన్నాలో మరో విలువైన వజ్రం బయటపడింది. స్వామిదిన్ పాల్ అనే కూలీ మరో ముగ్గురితో కలిసి సర్కోహా గ్రామంలో ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్వామిదిన్కు 32.80 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ భారీ వజ్రం విలువ రూ.1.5 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో స్వామిదిన్ పాల్ రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు. స్వామిదిన్ పాల్ ఈ వజ్రాన్ని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. భారీ వజ్రం లభించడం పట్ల కూలీ స్వామిదిన్ పాల్ సంతోషం వ్యక్తం చేశాడు. నలుగురు భాగస్వాములం డైమండ్ వేలంలో వచ్చిన డబ్బుల్ని సమానంగా పంచుకుంటామని చెప్పాడు. ఈ వజ్రం ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లలకు ఇళ్లు కట్టిస్తామని ఆ నలుగురు చెప్పుకొచ్చారు. పన్నా ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ధి. అనేక మంది ఆ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుని, ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతుంటారు. గనుల్లో దొరికిన వజ్రాల్ని డైమండ్ ఆఫీస్లో డిపాజిట్ చేసి, అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరికైనా తమ పొలాల్లో ఏదైనా విలువైన వజ్రం లేదా రాయి దొరికితే ప్రభుత్వం వాటి విలువలో 12.5 శాతం వాటా ఇస్తుంది. కానీ కొంత మంది తమకు గనుల్లో దొరికిందని, ఆ వస్తువు తమదే అని వాదిస్తారు. ఒక వేళ ఈ విషయం కోర్టుకు వెళ్తే తీర్పు గని యజమానికి అనుకూలంగానే వస్తుంది. ఒక వేళ డైమండ్ దొరికిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా దాచితే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.