వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. శస్త్రచికిత్స సమయంలో దెబ్బతిన్న కిడ్నీకి బదులు.. బాగున్న కిడ్నీని తొలగించారు. దీంతో ఆ పేషంట్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాజస్థాన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు జైపుర్‌లోని ఝుంఝు జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి బృందం ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించింది. అయితే.. సర్జరీ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దెబ్బతిన్న కిడ్నీకి బదులు బాగున్న కిడ్నీని తొలగించి సర్జరీ పూర్తి చేశారు. కొన్ని రోజులు గడిచినా మహిళకు ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మరో ఆస్పత్రికి వెళ్లారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్యం వల్ల ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు చేపట్టింది. క్లినికల్ లైసెన్స్‌ను రద్దు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో బొద్దింకల రాజధాని !! సర్వేలో వెల్లడి
రెయిలింగ్ పైనుంచి దూకుతున్న మొసలిని చూశారా ??
అరుదైన పామును పట్టుకున్నారు.. వీడియో వైరల్ చేసి బుక్ అయ్యారు
తాజ్ హోటల్లో వీధి కుక్క.. రతన్ టాటా ప్రేమకు నెటిజన్లు ఫిదా
ప్రభాస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. రిలీజ్ కు రెడీగా కల్కి ట్రైలర్