భోగి వేడుకల్లో డోలు వాయించిన హోంమంత్రి అనిత.. వీడియో వైరల్

Updated on: Jan 14, 2026 | 12:33 PM

నక్కపల్లి హోం మంత్రి అనిత నివాసంలో భోగి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. సంసృతి సంప్రదాయం ఉట్టిపడేలా భోగి వేడుకులను నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా పూజలు చేసి, భోగి మంటల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. ముఖ్యంగా భోగి వేడుకల్లో కేరళ బృదంతో కలిసి డోలు వాయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

హోం మంత్రి వంగలపూడి అనిత సంక్రాంతి పండుగలో భాగంగా నిర్వహించిన భోగి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె ఉత్సాహంగా కేరళ బృందంతో కలిసి డోలు వాయించారు. ఈ వేడుకల్లో ఆమె సందడి వాతావరణాన్ని సృష్టించారు.భోగి పండుగ రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఫలితాలను తీసుకురావాలని, శుభాలు కలగాలని హోం మంత్రి అనిత ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అనిత నివాసం భోగి మంటలు, డోలు వాయిద్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి అనిత స్వయంగా డోలు వాయించడంతో ఈ వేడుకలకు మరింత ప్రత్యేకత చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో సంక్రాంతి వేడుకలను జరుపుకుంటుండగా, ప్రజా ప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్

పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..

 

Published on: Jan 14, 2026 12:32 PM