600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

Updated on: Jan 18, 2026 | 3:35 PM

ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం చినకొత్తపల్లిలో 600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం వెలుగుచూసింది. సంక్రాంతి రోజున రైతు వీరనారాయణకు పొలంలో లభించిన ఈ విగ్రహం విజయనగర రాజుల కాలానికి చెందినదని పురావస్తు అధికారులు ధ్రువీకరించారు. అరుదైన కుడి తొండంతో ఉండ్రాళ్ళను తింటున్నట్లున్న ఈ శిల్పం భక్తుల ఆకర్షణగా మారింది. ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు నిర్ణయించారు.

ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామం అరుదైన చారిత్రక ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తన మొక్కజొన్న చేనుకు నీరు పెడుతున్న వీరనారాయణ అనే రైతుకు కాలువ గట్టున 600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభించింది. గతంలో జేసీబీతో మట్టి తీసినప్పుడు కొద్దిగా బయటపడిన రాయిని శుభ్రం చేయగా, అది అద్భుతమైన గణపతి విగ్రహంగా రూపుదిద్దుకుంది. ఈ విగ్రహాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ రిటైర్డ్ అధికారి జ్యోతి చంద్రమౌళి సంచలన విషయాలు వెల్లడించారు. ఇది సుమారు 14వ శతాబ్దానికి, అంటే విజయనగర రాజుల కాలానికి చెందినదని నిర్ధారించారు.

మరిన్ని వీడియోల కోసం :

సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!