Viral Video: సీఐకి హిజ్రాల సన్మానం.. రీజన్‌ ఏంటో తెలుసా.? ఇలాంటివి అరుదుగా జరుగుతాయి అంటున్న నెటిజన్లు(వీడియో)

|

Oct 03, 2021 | 9:46 PM

ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న డబ్బు. అర్థరాత్రి దొంగలు దోచుకెళ్లిపోయారు. రేపట్నుంచి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఆ సొత్తు తిరిగి దొరుకుతుందన్న నమ్మకం లేదు.

ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న డబ్బు. అర్థరాత్రి దొంగలు దోచుకెళ్లిపోయారు. రేపట్నుంచి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఆ సొత్తు తిరిగి దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఏదో నామ్ కే వాస్త్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దొంగలను పట్టుకుని సొత్తుని రికవరీ చేశారు. దీంతో బాధితులు దర్యాప్తు వేగంగా జరిగిన పోలీసు అధికారికి సన్మానం చేశారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. ఇంతకీ దొంగతనం జరిగింది ఎక్కడో తెలుసా.. ఓ హిజ్రా ఇంట్లో.

అనంతపురం జిల్లా విడపనకల్ గ్రామానికి చెందిన హిజ్రా అనుష్క అలియాస్ హనుమప్ప ఇంట్లో ఆగస్టు 31వ తేదీ రాత్రి దొంగతనం జరిగింది. తాళం పగలగొట్టి ఇంట్లోకి ఎంటరైన దొంగలు.. బీరువా, గూట్లో దాచి ఉంచిన 6.5 తులాల బంగారు నగలు, 4 లక్షల రూపాయల డబ్బు దోచుకెళ్లారు. దాచుకున్నదంతా దొంగలు దోచుకెళ్లడంతో అనుష్క ఎంతో దిగులు చెందింది. ఇక తన సొమ్ము తిరిగి రాదేమోనని కన్నీటిపర్యంతమైంది. కానీ ఎందుకైనా మంచిదని పోలీసులకు కంప్లైంట్ చేసింది. రంగంలోకి దిగిన ఉరవకొండ సీఐ శేఖర్ కేసును స్వయంగా పర్యవేక్షించారు.

టెక్నాలజీ సాయంతో దొంగలను పట్టుకున్నారు పోలీసులు. దొంగల నుంచి 4లక్షల రూపాయల నగదు, బంగారాన్ని రికవరీ చేశారు. ఇక తనకు దక్కదనుకున్న సొమ్ము తిరిగి రావడంతో అనుష్క, ఇతర హిజ్రాలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. కృతజ్ఞతగా హిజ్రాల సంఘం సభ్యులు ఉరవకొండ C.I శేఖర్‌ను సర్కిల్ ఆఫీసులో ఘనంగా సన్మానించారు. సీఐపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Lava in Sea: సముద్రంలో కలుస్తున్న లావా ప్రవాహం.. నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం..(వీడియో)

 Women Judges in Afghanistan: ఏది జరగకూడదని కోరుకున్నారో అదే జరిగింది.. మహిళా జడ్జీలకు చచ్చేంత భయం..(వీడియో)

 Diesel Gang Video: హైవేపై వింత గ్యాంగ్.. లారీ కనిపిస్తే చాలు అదే పని.. వైరల్ అవుతున్న వీడియో..

 Viral Video: హన్మకొండ జిల్లాలో అరుదైన సంఘటన.. అభివృద్ధి కోసం..గ్రామ పంచాయతీకి తాళం..(వీడియో)

Follow us on