తృటిలో తప్పిన పెను ప్రమాదం.. క్షణం ఆలస్యం అయ్యుంటే.. రైలు బ్లాస్ట్‌ అయిపోయేదే !!

|

Oct 19, 2024 | 1:22 PM

ఇటీవల రైలు ప్రమాదాలు జరిగేలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు దుండగులు. స్థానికులు, లోకోపైలట్ల అప్రమత్తతతో అనేక ప్రమాదాలను అడ్డుకున్నారు. రైల్వే ట్రాక్‌లపై గ్యాస్‌ సిలిండర్లు, సిమెంట్‌ దిమ్మెలు, ఇసుక వేసి రైళ్లు పట్టాలు తప్పేలా కుట్రలు పన్నుతున్నారు. తాజాగా డెహ్రడూన్‌లో లోకోపైలట్‌ అప్రమత్తతతో మరో పెనుప్రమాదం తప్పింది. లేదంటే క్షణాల్లో రైలు బ్లాస్ట్‌ అయిపోయేదే.

ఇటీవల రైల్వే ట్రాక్‌లపై బండరాళ్లు, గ్యాస్ సిలిండర్లు పెట్టిన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు రైలు ప్రమాదాలు జరిగేలా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ హైటెన్షన్ వైరును దుండగులు రైల్వే ట్రాకుపై పడేశారు. లోకో పైలట్ దూరం నుంచే దీనిని గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. డెహ్రాడూన్ నుంచి తనక్‌పూర్ వెళ్తున్న వీక్లీ ఎక్స్‌‌ప్రెస్ ఖాతిమా రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్‌పై 15 మీటర్ల పొడవున్న హైటెన్షన్ వైరు పడి ఉండడాన్ని లోకోపైలట్లు గుర్తించారు. ఆ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌పై పడి ఉన్న హైటెన్షన్ వైరును తొలగించి రైలు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adah Sharma: సుశాంత్ ఉరేసుకున్న ఇంటికి షిఫ్ట్ అయిన అదా శర్మ

వామ్మో.. ఏంటా ఆవేశం.. కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు ??

TOP 9 ET News: ఒక్క సాంగ్‌ కోసం రూ.20 కోట్లు !! | సంచలనం !! అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్‌

డెంగ్యూ వస్తే మేక పాలు తాగాలా ??

తులం బంగారం రూ.లక్ష ?? పుత్తడి జోరుకు బ్రేకులు పడే ఛాన్స్ లేదా ??

Follow us on