35 లక్షల పెళ్లిళ్లు.. రూ. 4.25 లక్షల కోట్ల బిజినెస్‌

|

Oct 22, 2023 | 9:50 AM

దీపావళి ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్‌లో లక్షల కోట్లలో వ్యాపారం జరిగి భారీగా లాభాలు వస్తాయని ట్రేడర్స్‌ అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు మొత్తం 23 రోజులపాటు పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగనుంది. ఈ 23 రోజుల వ్యవధిలో మొత్తం 35 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనాలు వేస్తున్నారు. దాదాపు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీపావళి ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్‌లో లక్షల కోట్లలో వ్యాపారం జరిగి భారీగా లాభాలు వస్తాయని ట్రేడర్స్‌ అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు మొత్తం 23 రోజులపాటు పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగనుంది. ఈ 23 రోజుల వ్యవధిలో మొత్తం 35 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనాలు వేస్తున్నారు. దాదాపు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క ఢిల్లీలోనే ఈ సీజన్‌లో దాదాపు 3.5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఢిల్లీలోనే ఈ 23 రోజుల వ్యవధిలో దాదాపు లక్ష కోట్ల వ్యాపారం జరగనుంది. గత ఏడాది ఇదే కాలంలో 32 లక్షల వివాహాలు జరిగాయి. మొత్తం వ్యాపారం రూ.3.75 లక్షల కోట్ల మేర జరిగింది. ఈ 23 రోజుల పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు 6 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.3 లక్షల చొప్పున ఖర్చవుతుందని అంచనా. దాదాపు 10 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.6 లక్షల చొప్పున ఖర్చవుతుందని, అదే విధంగా దాదాపు 12 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ. 10 లక్షలు, మరో 6 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ. 25 లక్షలు, 50 వేల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.50 లక్షల చొప్పున, మరో 50 వేల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gaganyaan Mission: గగన్ యాన్ ప్రాజెక్ట్ లో కీలక ప్రయోగం.. ఇస్రో సిద్ధం !!

పురుషులకు అందుబాటులోకి గర్భనిరోధక ఇంజెక్షన్

రెండు గ్రామాల ప్రజలను కంగారుపెడుతున్న దున్నపోతు

రెస్టారెంట్‌కు వెళ్లి పీకలదాకా తిని.. గుండెనొప్పి అంటూ..

కదులుతున్న కారు టాప్‌పై టపాసులు కాల్చుతూ హల్‌చల్‌

Follow us on