గణపతి లడ్డూకి హై సెక్యూరిటీ.. ఎవరో తెలుసా ??

|

Sep 26, 2023 | 9:51 AM

దేశవ్యాప్తంగా ఏడోరోజు గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణపతి నవరాత్రుల్లో వినాయకుడి చేతిలో పెట్టే లడ్డూకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ లడ్డూని చివరి రోజు వేలం వేస్తారు. గణేశుడి చేతిలో లడ్డూని ఎలాగైనా దక్కించుకోవాలని భక్తులు పోటీపడతారు. అంతేకాదు కొన్ని చోట్ల ఈ లడ్డూ చోరీ చేస్తుంటారు కూడా. అలాంటి ఘటనలు కూడా మనం చూశాం. అంత విశేషమైనది మరి వినాయకుడి లడ్డూ అంటే. అందుకే ఈ లడ్డూని రాత్రి పగలు కాపలా కాస్తుంటారు.

దేశవ్యాప్తంగా ఏడోరోజు గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణపతి నవరాత్రుల్లో వినాయకుడి చేతిలో పెట్టే లడ్డూకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ లడ్డూని చివరి రోజు వేలం వేస్తారు. గణేశుడి చేతిలో లడ్డూని ఎలాగైనా దక్కించుకోవాలని భక్తులు పోటీపడతారు. అంతేకాదు కొన్ని చోట్ల ఈ లడ్డూ చోరీ చేస్తుంటారు కూడా. అలాంటి ఘటనలు కూడా మనం చూశాం. అంత విశేషమైనది మరి వినాయకుడి లడ్డూ అంటే. అందుకే ఈ లడ్డూని రాత్రి పగలు కాపలా కాస్తుంటారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కే. సముద్రం మండల కేంద్రంలోని ఓ గణపతి లడ్డూకి మండపం ఏర్పాటుచేసిన సెక్యూరిటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసముద్రంలో కోతుల బెడద విపరీతంగా వుంటుంది. ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. ప్రతియేటా గణపతి మండపాల వద్ద ప్రసాదాలు ఎత్తుకు పోవడం, గణపతి చేతిలోని లడ్డూ ఎత్తుకు పోవడంతో ఉత్సవ కమిటీ నిర్వాహకులకు నిరాశే మిగిలుతుంది. ఈ కోతుల బెడదకు చెక్‌ పెట్టాలని ఓ మాస్టర్ ప్లాన్ ఆలోచించారు.. కొండ ముచ్చు ఉంటే కోతులు రావని గుర్తించిన ఆది దేవ సొసైటీ నిర్వాహకులు ఓ కొండముచ్చును తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టారు. భక్తుల పూజ సామాగ్రీ, లడ్డూ రక్షణ కోసం మండపం వద్ద కొండముచ్చు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ కొండముచ్చు సెక్యూరిటీకి రోజుకు 1500 రూపాయలు ఖర్చుచేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరేగింపులో ఉత్సాహంగా ఉరికాడు.. ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు

తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి.. జాగ్రత్తగా కాపాడిన శునకాలు

Follow us on