బాబోయ్‌! మినీ బస్సు సైజులో మొసలిని చూశారా

Updated on: Jun 11, 2025 | 4:59 PM

భూమిని భారీ గ్రహ శకలం ఢీకొట్టడం వల్లే డైనోసార్లు చనిపోయాయి. మెక్సికోలోని యుకటన్‌ ప్రాంతంలో 13 కిలోమీటర్ల వెడల్పు ఉన్న గ్రహ శకలం గంటకు 72వేల కి.మీ. వేగంతో ఢీకొట్టింది. దీంతో సుమారు 1,450 కిలోమీటర్ల మేర భూమిపై అంతా దగ్ధమైంది. ఎగిసిన దుమ్ము, ధూళితో నెలల కొద్దీ వాతావరణం పూర్తిగా మారిపోయింది. సూర్యరశ్మి అందక చెట్లు ఎండిపోయాయి.

డైనోసార్ల ఆహార చట్రం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి, తీవ్రమైన చలి నెలకొంది. ఫలితంగా 18 కోట్ల ఏళ్ల పాటు సాగిన డైనోసార్ల హవాకు తెరపడింది. సుమారు 75% జీవులు కనుమరుగయ్యాయి. ఆకాశంలో ఎగిరే, భూమిలో దాక్కొనే, సముద్రం లోతుల్లోకి వెళ్లగల జీవులు బతికి బయటపడ్డాయి. అలా బతికి బయటపడ్డ మొసళ్లు చాలా ప్రమాదకరమైనవి. మొసళ్లు నీటిలో ఉన్నప్పుడు అవి వేటాడే వేగం చూస్తే భయమేస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మొసలి హెన్రీ గురించి మీకు తెలుసా..! 1900 సంవత్సరంలో ఆఫ్రికాలోని బోట్స్‌వానాలో జన్మించింది. అప్పట్లో మనుషులను వారి పిల్లలను చంపి తినేసేది. 1903లో సుప్రసిద్ధ వేటగాడు సర్ హెన్రీ న్యూమాన్ ని స్థానిక గిరిజనులు ఆశ్రయించారు. అవసరం ఆయితే మొసలిని వధించమని చెప్పారు. అయితే హెన్రీ వల్లే నరమాంస భక్షక మొసలి ఇంకా బతికే ఉంది. హంటర్ హెన్రీ ఈ భారీ మొసలిని చంపకుండా సజీవంగా పట్టుకున్నారు. ఈ మొసలిని ఆఫ్రికాలోని క్రోక్‌వరల్డ్ కన్జర్వేషన్ సెంటర్‌కు పంపారు. వేటగాడు హెన్రీ న్యూమాన్ పేరు మీదుగా మొసలికి ‘హెన్రీ’ (HENRY) అని పేరు పెట్టారు. ఈ కన్వెన్షన్ సెంటర్ గత 40 సంవత్సరాలుగా హెన్రీ చిరునామా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క ఫోటోతో.. సోషల్ మీడియాను ఫిదా చేసిన రష్మిక

అడ్డంగా బుక్కైన మంగ్లీ.. బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్ మత్తు!

వీడు మామూలోడు కాదు.. ఎదురుపడిన కోబ్రాను ఏం చేసాడంటే

లోయర్ బెర్త్‌లో ఆ పని చేసిన వృద్ధ దంపతులు