Gulmarg: అంటార్కిటికాను తలపిస్తోన్న గుల్మార్గ్.! ఎటుచూసినా మంచుతో మెరిసిపోతున్న సిటీ.
కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ ప్రస్తుతం పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. ఎటు చూసిన శ్వేత వర్ణం సంతరించుకుని స్కీయింగ్ సిటీ పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తోంది. కాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎత్తైన ప్రాంతాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ ప్రస్తుతం పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. ఎటు చూసిన శ్వేత వర్ణం సంతరించుకుని స్కీయింగ్ సిటీ పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తోంది. కాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎత్తైన ప్రాంతాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అడుగులకొద్దీ పేరుకుపోయిన మంచుతో గుల్మార్గ్ అంటార్కిటికాను తలపిస్తోంది. చాలా రోజుల తర్వాత స్కీయింగ్ సిటీలో భారీ స్థాయిలో మంచు దర్శనమివ్వడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్కీయింగ్‌కు గుల్మార్గ్ పెట్టిందిపేరు. దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశీ పర్యాటకులు కూడా ఈ సీజన్‌లో స్కీయింగ్ సిటీకి పోటెత్తుతుంటారు. ఇప్పుడు కూడా పర్యాటకులు, స్పోర్ట్స్ లవర్స్ గుల్మార్గ్‌కు క్యూ కట్టారు. మంచులో స్కీయింగ్ చేస్తూ శీతల వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. విదేశీ టూరిస్ట్‌లు కూడా ఈ మంచులో స్కీయింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గుల్మార్గ్ మంచు అందాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..