Robbery Exclusive Video: సినిమా స్టైల్ లో చోరీ.. తుపాకులు గురిపెట్టి కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లి..
ముసుగులు ధరించి ప్రవేశించడం, బ్యాగులో తుపాకీలు తీసి బెదిరించి.. తాళాలు అడగడం.. ఇవ్వకపోతే.. కొట్టడం, తలపై తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించడం.. ఏందీ ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా..
ముసుగులు ధరించి ప్రవేశించడం, బ్యాగులో తుపాకీలు తీసి బెదిరించి.. తాళాలు అడగడం.. ఇవ్వకపోతే.. కొట్టడం, తలపై తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించడం.. ఏందీ ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా.. నిజమే ఇలాంటివి సినిమాలోనే ఎక్కువగా చూస్తాం. రియల్ గా బ్యాంకు దోపిడిలు, భారీ చోరీలు చూసినా.. ఈస్టైల్ లో చోరీలను చూసుండకపోవచ్చు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇలాంటి చోరి ఒకటి కలకలం రేపుతోంది. ఉదయపూర్‌లోని ప్రతాప్ నగర్‌లోని వాణిజ్య భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంలోకి ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది. సెక్యూరిటీ లేని గేటు నుంచి ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు లోపలకి చొరబడి, కార్యాలయంలోని ప్రధాన గదిలో ఉన్న వారందరినీ ఒక మూలకు వెళ్లాలని తుపాకీ గురిపెట్టి బెదిరించారు. వెళ్లకపోతే ఉద్యోగులు, కస్టమర్‌ను కాల్చివేస్తామని బెదిరించారు. వారి మొబైల్ ఫోన్లు తీసుకుని ల్యాండ్‌లైన్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. వీరందరికి ఓ దుండగుడు కాపలా ఉండగా.. మిగిలిన వారంతా స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ భద్రపర్చిన తాకట్టుకు వచ్చిన నగలను బ్యాగుల్లో సర్దుకున్నారు. 12 కోట్ల విలువైన దాదాపు 20 కిలోల బంగారాన్ని, 10 లక్షల నగదు దుండగులు పట్టుకుని వెళ్లిపోయారు. కార్యాలయం నుంచి దుండగులు బయటకు వెళ్లేటప్పుడు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ చేతులు కట్టేసి, మిగిలినవారు బయటకు రాకుండా ఆఫీసు ప్రధాన ద్వారాన్ని లాక్ చేసి పరారయ్యారు. దుండగులు బైక్ పై వచ్చినట్లు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. పది నిమిషాల వ్యవధిలో ఈచోరీ మొత్తం పూర్తయింది. దుండగులను పట్టుకోవడానికి పోలీసులు జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఈచోరీలో సంస్థ ఉద్యోగుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బ్రాంచిలో సెక్యూరిటీ లేకపోవడంపై పోలీసు అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులను నియమించకూడదనేది కంపెనీ విధానంగా బ్యాంకు మేనేజర్ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Pawan Kalyan: వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).
Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)
