Viral video: ఒంటికాలిపై స్కూల్‌కు..కంటతడి పెట్టిస్తున్న దివ్యాంగ విద్యార్థిని వీడియో..

|

Jun 02, 2022 | 8:39 AM

ఓ దివ్యాంగ విద్యార్థిని చదువుపై ఉన్న మక్కువతో స్కూలుకు వెళ్తున్న విధానం హృదయాలను కదిలిస్తోంది. ఈ బాలిక చక్కగా స్కూల్‌ యూనిఫాం వేసుకొని ఒంటికాలిపై స్కూల్‌కు వెళ్లే వీడియో


ఓ దివ్యాంగ విద్యార్థిని చదువుపై ఉన్న మక్కువతో స్కూలుకు వెళ్తున్న విధానం హృదయాలను కదిలిస్తోంది. ఈ బాలిక చక్కగా స్కూల్‌ యూనిఫాం వేసుకొని ఒంటికాలిపై స్కూల్‌కు వెళ్లే వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయ్యింది. బీహార్ రాష్ట్రంలోని జాముయ్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థిని ప్రతిరోజూ కిలోమీట‌ర్ దూరంలో ఉన్న పాఠ‌శాల‌కు అలా గెంతుకుంటూ వెళ్తోంది. ఈ వీడియో ప్రముఖ న‌టుడు, స‌మాజ‌ సేవ‌కుడు సోనూసూద్ కంట‌ప‌డింది. ఆ చిన్నారి అవస్థ చూసి చలించిపోయిన సోనూసూద్‌ త్వర‌లోనే ఆమెకు స‌హాయం చేయ‌నున్నట్లు ప్రక‌టించారు.స్థానిక మీడియా ప్రకారం ఓ రోడ్డుప్రమాదంలో ఆ విద్యార్థిని కాలు కోల్పోయింది. అయినా, చదువుకోవాల‌నే ఆమె త‌ప‌న‌ముందు వైక‌ల్యం ఓడిపోయింది. ఒంటికాలిపై గెంతుతూ త‌న ల‌క్ష్యాన్ని సాధించేందుకు స్కూల్ బాట‌ప‌ట్టింది. ఆ విద్యార్థినికి చ‌దువుపై ఉన్న శ్రద్ధ సోనూసూద్‌ను క‌ట్టిప‌డేసింది. ‘ఇక నువ్వు స్కూల్‌కు ఒక కాలిపై గెంతుకుంటూ వెళ్లవు. టికెట్స్ పంపిస్తున్నా వ‌చ్చేయ్‌.. నువ్వు రెండు కాళ్లపై చెంగుచెంగున స్కూల్‌కు వెళ్లాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి సోనూసూద్‌పై నెటిజ‌న్లు ప్రశంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on