Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Shapped Island: అమ్మకానికి హార్ట్ షేప్‌ లవ్ ఐలాండ్.. ఎందుకో తెలుసా..! వీడియో వైరల్..

Heart Shapped Island: అమ్మకానికి హార్ట్ షేప్‌ లవ్ ఐలాండ్.. ఎందుకో తెలుసా..! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Feb 22, 2023 | 9:52 PM

చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ద్వీపంలో హోటళ్లు, విల్లాలు లేదా రెస్టారెంట్లు లేవు, కానీ వేడి వేసవి నెలల్లో ఇది స్వర్గధామం. మీరు ప్రశాంతంగా గడపాలని కోరుకుంటే, ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది.

చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ద్వీపంలో హోటళ్లు, విల్లాలు లేదా రెస్టారెంట్లు లేవు, కానీ వేడి వేసవి నెలల్లో ఇది స్వర్గధామం. మీరు ప్రశాంతంగా గడపాలని కోరుకుంటే, ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. చాలామంది వాలంటైన్స్ డే రోజున తమ ప్రియులకి జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఉండే ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందబ్బా అని తెగ ఆలొచిస్తుంటారు. అయితే ఇప్పుడు మీకో అద్భుతమైన అవకాశం. మీ ప్రియసి లేదా ప్రియుడు కోసం ఏకంగా ఓ ఐలాండ్ ని గిఫ్ట్ గా కూడా ఇచ్చే అవకాశం వచ్చింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అమ్మకానికి సిద్దంగా ఐలాండ్ హార్ట్ షేప్‌లో ఉండటం విశేషం. అంతేకాకుండా దీనికి ఐలాండ్ ఆఫ్ లవ్ అన్న నామకరణం కూడా చేశారు. ఈ ఐలాండ్ క్రొయేషియాలోని అడ్రియాటిక్ సముద్రం పాస్మాన్ తీరంలో ఉంది. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడికి పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ప్రపంచం నలుమూలల నుండి సెలబ్రిటీలందరూ తమ కుటుంబంతో ఇక్కడకు వచ్చి హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంటారు. మీరు కూడా మీ ప్రియమైన వ్యక్తికి ఆశ్చర్యకరమైన బహుమతిని ఇవ్వాలనుకుంటే, మీరు దీన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే దీని కోసం కొంత ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. దాని ధర సుమారు 11 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి వినియోగిస్తామన్నారు ఐలాండ్ ప్రతినిధి సిల్వెస్ట్రో కార్డమ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..