Viral Video: యూపీలో సంచలనం.. పోస్టుమార్టం చేయబోయిన శరీరంనుంచి గుండెచప్పుడు..
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఓ కుటుంబం అంతా అయిపోయిందుకున్న సమయంలో మ్యాజిక్ జరిగింది. ఇంట్లోని శోకసంద్రం కాస్త ఆనందంగా మారింది. ప్రస్తుతం ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఓ కుటుంబం అంతా అయిపోయిందుకున్న సమయంలో మ్యాజిక్ జరిగింది. ఇంట్లోని శోకసంద్రం కాస్త ఆనందంగా మారింది. ప్రస్తుతం ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. రాహ్ కలాం హవూదవా గ్రామంలోని చెరువులో రవీనా అనే యువతి దేహం తేలుతూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె కుటుంబసభ్యులకు విషయం తెలిపారు. ఆ యువతి మృతిచెందిందని భావించిన పోలీసులు పోస్టుమార్టంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తల్లిదండ్రులు ఆమెను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలని కోరారు. దీంతో పోలీసులు పటెహరా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు యువతిని పరిశీలించి, గుండె కొట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. వెంటనే చికిత్స చేయడం ప్రారంభించడంతో యువతి కోలుకుంది. తమ కూతురు బతికేవుందని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తమ కూతురు మానసిక స్థితి సరిగ్గా లేదని.. ఇంట్లో చెప్పకుండానే వెళ్లిపోయిందని తెలిపారు. ఏదిఏమైన తమ కూతురు బతకడమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

