Viral Video: అట్లుంటది మరి.. డీజే సౌండ్‌కు ఆగిన గుండె.. నిశ్చితార్థం వేళ యువకుడి..

|

May 01, 2022 | 9:30 AM

పెళ్లి, నిశ్చితార్థం ఇలా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు డీజే పెట్టి సందడి చేయడం పరిపాటిగా మారింది. అలా శుభకార్యం కోసం ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌ ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. వివరాల్లోకి వెళ్తే..


పెళ్లి, నిశ్చితార్థం ఇలా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు డీజే పెట్టి సందడి చేయడం పరిపాటిగా మారింది. అలా శుభకార్యం కోసం ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌ ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. వివరాల్లోకి వెళ్తే..ఢిల్లీకి చెందిన అంకిత్‌కు ఒడిశాలోని మల్కాన్‌గిరి పట్టణానికి చెందిన యువతితో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. నిశ్చితార్థం చేసుకోవడానికి యువకుడితోపాటు కుటుంబం బుధవారం దిల్లీ నుంచి మల్కాన్‌గిరికి వచ్చింది. లాడ్జీలో కాసేపు విశ్రాంతి తీసుకుని యువతి ఇంటికి బయలుదేరేందుకు హోటల్‌ నుంచి బయటకు వచ్చారు. వారికి ఆహ్వానం పలికేందుకు అక్కడ సిద్ధంగా ఉంచిన డీజేను ఒక్కసారిగా ఆన్‌ చేయడంతో ఆ శబ్దానికి యువకుడి తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Published on: May 01, 2022 09:21 AM