కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా.. చూస్తే గుండె గల్లంతే

Updated on: Oct 28, 2025 | 6:23 PM

కింగ్‌ కోబ్రాను చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. పొరబాటున అది ఎదురుపడితే.. ఎంతటి ధైర్యవంతుడైనా భయంతో పరుగులు తీయాల్సిందే. ఖర్మ కాలి అదిగానీ.. కాటు వేస్తే మనిషి కాటికి పోవాల్సిందే. అలాంటి కింగ్‌ కోబ్రా.. తనను పట్టుకోడానికి వచ్చిన స్నేక్‌ క్యాచర్‌పై తిరగబడింది. అతన్ని కాటు వేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఎంతో చాకచక్యంగా అతను తప్పించుకున్నాడు.

పామును బంధించేందుకు అతను చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఈ ఘటన హరిద్వార్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు భయంతో తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆదివారం హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున చండి ఘాట్ ప్రాంతంలో ఎక్కడినుంచి వచ్చిందోకానీ ఒక్కసారిగా 15 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది.దీంతో అక్కడున్న వారు భయంతో కేకలు వేస్తూ.. తలో దిక్కూ పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్‌కు చుక్కలు చూపించింది. బుసలు కొడుతూ అందరినీ తీవ్రభయాందోళనకు గురిచేసింది. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు గంటసేపు స్నేక్‌ క్యాచర్‌ను ముప్పు తిప్పలు పెట్టింది కింగ్‌ కోబ్రా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 అడుగుల పొడవున్న ఆ పాము చాలా చురుగ్గా కదులుతూ స్నేక్‌ క్యాచర్‌నుంచి తప్పించుకుని నదిలోకి పారిపోవడానికి ప్రయత్నించింది. పట్టుకోడానికి ప్రయత్నించిన ప్రతిసారీ స్నేక్‌ క్యాచర్‌ను కాటువేసేందుకు అంతెత్తున లేస్తూ దూసుకొచ్చింది. అటవీ శాఖ సిబ్బంది ఆపరేషన్ అంతటా అప్రమత్తంగా ఉన్నారు. స్నేక్ క్యాచర్ చాకచక్యంగా వ్యవహరించి భారీ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేశారు. అనంతరం, నాగుపామును రాజాజీ టైగర్ రిజర్వ్‌లోని మానవ నివాసాలకు దూరంగా అడవిలో విడిచిపెట్టారు. మొత్తం రెస్క్యూ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పశువులకోసం గడ్డి కోస్తున్న యువతి.. ఊహించని విధంగా

పంటపొలాల్లో చేపల సందడి.. సంచులతో ఎగబడ్డ జనం

చింపాంజీ గెటప్‌లో మున్సిపల్ సిబ్బంది.. జనగామలో వింత ప్రయోగం

Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా

తాత ముత్తాతల మూలాలేవి? 150 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐదో తరం వ్యక్తి !! అచ్ఛం 7 తరాలు కథ లాంటి స్టోరీ