Trending Video: ఫుడ్‌ డెలివరీ ఆలస్యం కావడంతో కస్టమర్‌ అసహనం.. తీరా డెలివరీ బోయ్‌ని చూసి షాక్‌ తిన్న కస్టమర్‌..

|

Aug 22, 2022 | 9:42 AM

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ యాప్ లో ఫుడ్ ను ఆర్డర్ చేశాడు. అయితే ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో డెలివరీ బాయ్ కు ఫోన్ చేశాడు. సార్ ఐదు నిమిషాల్లో మీకు డెలివరీ చేస్తా అని చెప్పాడు..


బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ యాప్ లో ఫుడ్ ను ఆర్డర్ చేశాడు. అయితే ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో డెలివరీ బాయ్ కు ఫోన్ చేశాడు. సార్ ఐదు నిమిషాల్లో మీకు డెలివరీ చేస్తా అని చెప్పాడు.. అయితే అరగంట తర్వాత డోర్‌బెల్ రింగ్ అయింది. ఆకలి మంటతో ఉన్న కస్టమర్‌ కోసంగా డోర్ తీశాడు. అయితే తనకు ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు. ఊతకర్రల సాయంతో.. చేతిలో ఫుడ్ కవర్ ని పట్టుకొని డెలివరీ ఇవ్వడానికి రెడీగా చిరునవ్వుతో గుమ్మం ముందు నిల్చున్నాడు. అతన్ని చూడగానే కస్టమర్‌ షాకయ్యాడు. తన ప్రవర్తనకి సిగ్గుపడి అతనికి క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఆ డెలివరీ బాయ్ కరోనా రాకముందు వరకూ ఒక కెఫేలో పనిచేసేవాడని, తర్వాత ఆ ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబ పోషణ కోసం స్వీగ్గి డెలివరీ బాయ్‌గా మారినట్లు చెప్పాడు. అయితే తన సంపాదనతో కుటుంబాన్ని బెంగళూరులో ఉంచి పోషించలేనని, అందుకే వారిని గ్రామంలో ఉంచినట్లు తెలిపాడు. అంతేకాదు.. తనకు మరో డెలివరీ ఉందని.. ఆలస్యం అవుతుందంటూ వెళ్లిపోయాడని అతని గురించి సదరు కస్టమర్‌ చెప్పాడు. హృదయవిదారకమైన కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ఈ పోస్టు పై స్పందిస్తున్నారు. డెలివరీ బోయ్‌ ఆత్మవిశ్వాసంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 22, 2022 09:42 AM