రోడ్డు పక్కనే 2వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. పండగ చేసుకున్న స్థానికులు
Hens

రోడ్డు పక్కనే 2వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. పండగ చేసుకున్న స్థానికులు

Updated on: Nov 11, 2025 | 3:15 PM

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వింత ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి వెంబడి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 2,000 నాటు కోళ్లను వదిలేశారు. ఒక్కసారిగా వేల సంఖ్యలో కోళ్లను చూసిన గ్రామస్తులు సంచులతో వచ్చి తీసుకెళ్లారు. కిలో ₹500 ధర పలికే ఈ నాటు కోళ్లతో ఊరంతా పండుగ చేసుకుంది. ఈ ఘటన వెనుక ఉన్న రహస్యం ఇంకా ప్రశ్నార్థకమే.

మార్కెట్‌లో నాటు కోడి మాంసం కావాలంటే. మటన్‌తో సమానంగా రేటు చెల్లించాల్సిందే. ఆ కూరకు అంత క్రేజ్ మరి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఎల్కతుర్తి, సిద్ధిపేట జాతీయ రహదారి వెంబడి వేల కొద్ది నాటుకోళ్లు దర్శనం ఇచ్చాయి.ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు కానీ.. హైవే పక్కన వేల సంఖ్యలో నాటుకోళ్లు ప్రత్యక్షం అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు సుమారు 2 వేల నాటు కోళ్లను వదిలేశారు. ఒక్కసారిగా కోళ్లను చూసిన గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. ఈ వార్త కాస్త క్షణాల వ్యవధిలోనే పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలకు తెలిసింది. ఇంకేముందు సంచులు తీసుకుని మరి ఎగబడ్డారు. అందిన కాడికి కోళ్లను చేత పట్టుకుని అక్కడ నుంచి జంప్ అయ్యారు. ఒక్కొక్కరు రెండు, మూడు కోళ్లను పట్టుకొని ఇంటికి తీసుకువెళ్లగా.. కొందరు పదుల సంఖ్యలో తీసుకెళ్లారు. చాకచక్యంగా కోళ్లను పట్టుకొని.. ఇంటికి తీసుకెళ్లి వండుకొని పండుగ చేసుకున్నారు. ఊరంతా నాటుకోడి చికెన్ తినడంతో పండుగ వాతావరణం కనిపించింది. ఆ కోళ్లను అక్కడ ఎవరు వదిలేశారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా హైవే పక్కన వేల సంఖ్యలో నాటు కోళ్లను వదిలేసి వెళ్లారని అంటున్నారు. కిలో నాటుకోడి ధర సుమారు 500 రూపాయల వరకు ఉంది. ఒకప్పుడు ప్రతీ ఇంట్లో కోళ్లు పెంచేవారు. కానీ ఇప్పుడు అందరివీ పక్కా ఇళ్లు కావడంతో చాలా మంది కోళ్ల పెంపకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వ్యాపారస్తులు మాత్రమే షెడ్లలో కోళ్లను పెంచుతున్నారు. ఇప్పుడు ఇలా నాటు కోళ్లు దొరకడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేవు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకు మృతిని తట్టుకోలేక ప్రాణం విడిచిన తండ్రి..

భారత్‌పై లానినా ఎఫెక్ట్‌.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్‌

యాదాద్రీశుడికి భారీ ఆదాయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్.. ఊపిరి పీల్చుకున్న అమెరికన్లు

వరుస తుఫాన్‌లతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం