AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rapido Fake App: ఫేక్‌ ర్యాపిడో యాప్‌తో క్యాబ్‌ డ్రైవర్‌ మోసం

Rapido Fake App: ఫేక్‌ ర్యాపిడో యాప్‌తో క్యాబ్‌ డ్రైవర్‌ మోసం

Phani CH
|

Updated on: Nov 11, 2025 | 3:25 PM

Share

బెంగళూరులో క్యాబ్ డ్రైవర్లు కొత్త స్కామ్‌లకు పాల్పడుతున్నారు. నకిలీ యాప్‌లు, స్క్రీన్‌షాట్‌లతో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా, ఓ మహిళ ర్యాపిడో డ్రైవర్ మోసాన్ని తెలివిగా ఎదుర్కొని, అధిక డబ్బులు చెల్లించకుండా తప్పించుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి క్యాబ్ స్కామ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

క్యాబ్ డ్రైవర్లు కొత్త కొత్త స్కామ్‌లకు తెరతీస్తున్నారు. రకరకాల ఐడియాలతో కస్టమర్ల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఓ బెంగళూరు క్యాబ్ డ్రైవర్‌నే బురిడీ కొట్టించి అధిక డబ్బులు చెల్లించే అగత్యం నుంచి తప్పించుకున్నారో కస్టమర్. మీనల్‌ గోయెల్‌ అసలేం జరిగిందో చెబుతూ తాజాగా పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఫేక్‌ యాప్‌తో ర్యాపిడో డ్రైవర్లు జనాన్ని మోసం చేస్తున్నారంటూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్‌మీడియాలో ప్రజలను హెచ్చరించారు. దీనిపై స్పందించిన ర్యాపిడో కంపెనీ బాధ్యుడైన సదరు డ్రైవర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపింది. జోరు వాన పడుతుండటంతో తాను తప్పనిసరి పరిస్థితుల్లో 2.6 స్టార్ రేటింగ్ ఉన్న ర్యాపిడో క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ‘‘క్యాబ్ సమీపంలోనే ఉండటంతో బుక్ చేసుకున్నా. నా యాప్‌లో ధర రూ.532గా కనిపించింది. ప్రయాణం పెద్ద సౌకర్యంగా లేకున్నా పర్లేదులే అనుకుని అడ్జస్ట్ అయ్యాను. డ్రాప్ లొకేషన్‌కు రాగానే డ్రైవర్ తన యాప్ కాకుండా ఎప్పుడో సేవ్ చేసుకున్న ఓ స్క్రీన్ షాట్ చూపిస్తూ రూ.650 చెల్లించాలని అన్నాడు. నేను దారిలో ఎక్కడా ఆగింది లేదు.. క్యాబ్ రూట్‌లో కూడా మార్పు లేదు. దీంతో, అతడు నన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమైంది’’ అంటూ ఆమె రాసుకొచ్చారు. తను మాత్రం అతణ్ణి అప్పుడే నిలదీయదలుచుకోలేదు. అప్పటికి ట్రిప్ ఇంకా పూర్తికాకపోవడంతో కస్టమర్‌ కేర్‌కు కాల్ చేసే అవకాశం కూడా లేదు. ఆ తరువాత అధిక ధర గురించి ప్రస్తావిస్తే డ్రైవర్ రకరకాల కారణాలు చెబుతూ తనను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడనీ చెప్పుకొచ్చారు. సర్వర్‌లో అప్‌డేట్ అయ్యేందుకు టైం పడుతుందన్నాడు. నా మెయిల్ చెక్ చేసుకోమన్నాడు. చివరకు కస్టమర్‌ కేర్‌కు కాల్ చేయమన్నాడు. తను మాత్రం గట్టిగా ప్రతిఘటించలేదనీ తన యాప్‌లో ఏముంటే అంతే ఇస్తానని చెప్పానన్నారు. దాంతో అతడు దబాయించడం మొదలెట్టాడు. కానీ తాను మాత్రం అంతే మర్యాదగా సమాధానమిస్తూ వచ్చానని చెప్పారు. అతను తనతో గొడవ పడటానికే సిద్ధమయ్యాడని చెప్పారు. అతడి స్కామ్ అర్థమైన తాను ఏమాత్రం తొందరపడకుండా మెల్లగా మాట్లాడుతూ అతడిని బురిడీ కొట్టే ప్రయత్నం చేశాననన్నారు. ఒక్కసారి సర్వర్‌కు కనెక్ట్ కాగానే మొత్తం ఇచ్చేస్తానని మెల్లగా చెప్పాను. ఇలా 30 నిమిషాలు గడిచిపోయింది. చివరకు అతడు ఏమనుకున్నాడో ఏమో కానీ వెళ్లిపోయాడు. డ్రైవర్ వెళ్లిన మరుక్షణమే రైడ్ ఎండైనట్టు నోటిఫికేషన్ వచ్చింది. అందులో ట్రిప్ ధర రూ.532గా కనిపించింది. అతడి స్కామ్ నుంచి తప్పించుకున్నందుకు తనకు కాస్తంత గర్వంగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చారామె. మీనల్‌ గోయల్‌ లింక్డిన్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. ముందస్తుగానే డబ్బు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ఈ సమస్యలు ఉండవని సలహా ఇచ్చారు. తమకూ ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైందని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చీకటిమయం కాబోతున్న భూమి.. కారణం అదేనంటున్న నాసా

రోడ్డు పక్కనే 2వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. పండగ చేసుకున్న స్థానికులు

కొడుకు మృతిని తట్టుకోలేక ప్రాణం విడిచిన తండ్రి..

భారత్‌పై లానినా ఎఫెక్ట్‌.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్‌

యాదాద్రీశుడికి భారీ ఆదాయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం ఎంతో తెలుసా?