జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
జిమ్‌లో వ్యాయామం వల్ల కలిగే ప్రమాదాలు చాలా మందికి తెలియవు. ఇటీవల, 27 ఏళ్ల యువకుడు డెడ్‌లిఫ్ట్ చేస్తూ శ్వాస బిగబట్టి కంటి చూపు కోల్పోయాడు. వైద్యుల ప్రకారం, ఇది వల్సాల్వా రెటినోపతి. డాక్టర్ ఆశిష్ మార్కాన్ ఈ విషయాన్ని పంచుకుని, అధిక బరువులు ఎత్తేటప్పుడు శ్వాస తీసుకోవడం, చూపులో తేడా వస్తే విశ్రాంతి తీసుకోవడం వంటి కీలక సూచనలు చేశారు. జిమ్ చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
ప్రతీ రోజూ జిమ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా,ఫిట్ గా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ, జిమ్ చేయడం వల్ల కంటి చూపు కోల్పోయిన వారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు అదే జరిగింది. అవును.. జిమ్ చేస్తూ 27ఏళ్ల యువకుడు కంటి చూపు కోల్పోయాడు..ఈ విషయాన్ని ప్రముఖ డాక్టర్ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టా వేదికగా ప్రజలకు షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా జిమ్‌కి వెళ్లే వాళ్లందరికీ కీలక సూచనలు చేశారు. నిన్నమొన్నటి వరకు జిమ్‌లో హార్ట్ ఎటాక్ మరణాల వార్తలు విన్న వారంతా ఇప్పుడు కంటి చూపు పోయిన సంగతి తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు. జిమ్‌లో వ్యాయామం చేయడం శరీరానికి మంచిదే. కానీ, వ్యాయామం చేసే పద్ధతిలో జరిగే కొన్ని పొరబాట్ల వలన కొన్ని సమస్యలూ వస్తుంటాయి. ఇటీవల 27 ఏళ్ల వ్యక్తికి సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. జిమ్‌లో డెడ్‌లిఫ్టింగ్ చేస్తున్నఆ వ్యక్తికి.. ఎందుకో తన కంటి చూపులో తేడా ఉందని అనిపించింది. వెంటనే అరచేతితో ఒక కన్ను మూసి చెక్ చేసుకోగా.. తన రెండవ కన్ను కనిపించటం లేదని గుర్తించాడు. దీంతో షాక్ తిన్న ఆ యువకుడు వెంటనే వైద్యులను కలిశాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా డాక్టర్ ఆశిష్ మార్కాన్ ఈ ఘటనకు దారితీసిన పరిణామాలను వివరించాడు. బాధిత యువకుడు జిమ్‌లో డెడ్ లిఫ్టింగ్ చేస్తున్నాడు. చాలా ఎక్కువ బరువును ఎత్తేక్రమంలో అతడు తన శక్తినంతా ఉపయోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు తన శ్వాసను బిగబట్టాడు. ఈ క్రమంలో అతని ఒక కంటి చూపు పోయింది. వైద్యుల పరీక్షల్లో కంటిలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి, రెటీనాలోని చిన్న రక్త నాళాలు పగిలిపోయాయని, వైద్య పరిభాషలో దీనిని.. వల్సాల్వా రెటినోపతి అంటారని తేలింది. ఈ సమస్య వచ్చినప్పుడు కంటిలో రక్తం గడ్డకడుతుందని, చాలా కేసుల్లో చికిత్స అనంతరం.. ఈ సమస్య ఓ వారం రోజుల్లో పరిష్కారం అవుతుందని, చికిత్స తీసుకోకపోతే మాత్రం తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. జిమ్‌లో అధిక బరువులు ఎత్తే వారు.. ఆ సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలని డాక్టర్లు వివరించారు. ఎక్కువ బరువులు ఎత్తే సమయంలో కళ్లు తిరిగినట్లు అనిపించినా, చూపులో తేడాలున్నా.. వెంటనే వ్యాయామం ఆపేసి విశ్రాంతి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ రికార్డు
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం.. ఆన్‌లైన్‌లో కెమికల్స్ కొని దర్జాగా డ్రగ్స్ తయారీ