Viral Video: రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ వద్ద చాకచక్యంగా దొంగతనం.. రూ. 43లక్షలతో జంప్‌ అయిన దొంగలు..(వీడియో)

Viral Video: రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ వద్ద చాకచక్యంగా దొంగతనం.. రూ. 43లక్షలతో జంప్‌ అయిన దొంగలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 13, 2022 | 9:07 AM

సిద్ధిపేట జిల్లాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్బన్‌ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపి సుమారు 42.50 లక్షల రూపాయలు దుండగులు ఎత్తికెళ్లారు. కాల్పుల్లో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా...


సిద్ధిపేట జిల్లాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్బన్‌ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపి సుమారు 42.50 లక్షల రూపాయలు దుండగులు ఎత్తికెళ్లారు. కాల్పుల్లో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.హౌసింగ్‌బోర్డుకు చెందిన రియల్టర్‌ నరసయ్య నెలరోజుల క్రితం 176 గజాల ఫ్లాట్‌ను శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తికి అమ్మారు. రిజిస్ట్రేషన్‌ కోసం సిద్దిపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. తన దగ్గర ఉన్న 43 లక్షలు కారులో పెట్టారు. ఆ విషయం డ్రైవర్‌కి చెప్పి రిజిస్ట్రార్‌ ఆఫీసులోకి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు కారు డ్రైవర్‌ పరశురామ్‌పై కాల్పులు జరిపి.. డబ్బు ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్‌ ధరించి పల్సర్‌ బైక్‌పై పారిపోయినట్లు రియల్టర్‌ నరసయ్య తెలిపారు. హడావుడిలో దుండగులు గన్‌ను కారులోనే పడేసి వెళ్లిపోయారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో సిసి ఫుటేజీ లేకపోవడంతో ప్రత్యక్షసాక్షులను విచారించారు పోలీసులు. దాంతోపాటు ప్లాట్‌ కొన్న శ్రీధర్‌రెడ్డి, అమ్మిన నరసయ్యను కూడా విచారిస్తున్నారు.