Donkey Gift: పెళ్లిలో నవవధువుకు గాడిదను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు..! పూజారితో సహా అందరూ షాక్..

|

Dec 16, 2022 | 8:46 PM

ప్రపంచంలో అత్యంత కష్టపడి పనిచేసే జంతువుగా గాడిద అని చెబుతుంటారు. అలాగే ఎవరినైనా మూర్ఖత్వాన్ని చూపించడానికి ఉదాహరణగా గాడిదతో పోల్చుతుంటారు. అయితే


ప్రపంచంలో అత్యంత కష్టపడి పనిచేసే జంతువుగా గాడిద అని చెబుతుంటారు. అలాగే ఎవరినైనా మూర్ఖత్వాన్ని చూపించడానికి ఉదాహరణగా గాడిదతో పోల్చుతుంటారు. అయితే, ఓ వరుడు తన పెళ్లి వేడుకలో వధువును ఆశ్చర్యపరుస్తూ గాడిదను బహుమతిగా ఇచ్చాడు. మొదట్లో ఈ వింత కానుకను చూసి షాక్ తిన్న పెళ్లికూతురు.. తర్వాత భర్త అలా చేయడానికి గల కారణం చెప్పడంతో సంబరపడిపోయింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌కు చెందిన జంతు ప్రేమికుడు అజ్లాన్ షా తన భార్య వారిశాకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చే సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బహుమతిగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నావని అడిగితే.. జంతువులు అంటే చాలా ఇష్టం. వారిశా కూడా జంతు ప్రేమికురాలు అనే కారణంతోనే వివాహం చేసుకున్నట్లు చెప్పారు. జనాలు ఏమైనా అనుకోనివ్వండి నాకు మాత్రం గాడిద అంటే విపరీతమైన ప్రేమ.. వారిశాకు ఇదే నా బహుమతి అని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు గాడిద అంటూ సమాధానమిచ్చాడు. అజ్లాన్ మాటలు విన్న వధువు వారిశా.. దీన్ని కేవలం గాడిదలా చూడటం లేదన్నారు. మంచి కానుకగానే భావిస్తానన్నారు. ధోబీ ఘాట్ నుంచి గాడిదతో పాటు దాని పిల్లను 30 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు అజ్లాన్ షా తెలిపారు. ఇది చాలా ఇష్టమైన జంతువు. దయచేసి దీని గురించి ఎగతాళి చేయొద్దంటూ బహుమతి ఇచ్చే సమయంలో వధువుకు చెప్పినట్లు అజ్లాన్ షా తెలిపారు. అయితే, అజ్లాన్ షా ఇచ్చిన ఈ అరుదైన కానుక గురించి సోషల్ మీడియాలో కొందరు పొగుడుతుండగా, ఎగతాళి చేసేవారు కూడా చాలామందే ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 16, 2022 08:46 PM