Greece Wildfire: అగ్ని దేవుడికి కోపం వచ్చింది.. ఆహుతైన 310 చదరపు మైళ్ల అడవి.

|

Sep 04, 2023 | 9:47 AM

గ్రీసులో చెలరేగిన కార్చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. దాదాపు పది రోజులుగా గ్రీసు అడవి తగలబడుతోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు గ్రీస్ దేశం నానా తంటాలు పడుతోంది. దాదాపు 310 చదరపు మైళ్లు మంటలకు ఆహుతైంది. ఈ అగ్నికీలల్లో 18 మంది మాడిమసైపోయారు. దడియా నేషనల్ పార్క్ లోని అరుదైన పక్షులు అగ్నికి ఆహుతయ్యాయి.

గ్రీసులో చెలరేగిన కార్చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. దాదాపు పది రోజులుగా గ్రీసు అడవి తగలబడుతోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు గ్రీస్ దేశం నానా తంటాలు పడుతోంది. దాదాపు 310 చదరపు మైళ్లు మంటలకు ఆహుతైంది. ఈ అగ్నికీలల్లో 18 మంది మాడిమసైపోయారు. దడియా నేషనల్ పార్క్ లోని అరుదైన పక్షులు అగ్నికి ఆహుతయ్యాయి. యూరోప్‌ దేశాలు 11 నీటిని మోసుకెళ్లే విమానాలను, ఒక హెలికాఫ్టర్ ను, 407 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక దళాలను దడియా పంపాయి. ఆపత్కాల సమయంలో గ్రీస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈయూ అధికారులు తెలిపారు. ఈ ఏడాది వేసవిలో గ్రీస్‌ సహా యూరోప్‌లోని ఇతర దేశాలు కార్చిచ్చు సమస్యను ఎదుర్కొన్నాయి. పర్యావరణంలో మార్పులే కారణమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఐరోపా దేశాలన్నీ సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని ఈయూ మేనేజ్మెంట్ కమిషనర్ జన్జ్ లెనర్సిక్ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..