Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌.. లాక్‌స్క్రీన్‌లో డైరెక్షన్స్‌.!

|

Mar 02, 2024 | 10:38 AM

తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్నా, షార్ట్‌కట్‌ రూట్స్‌లో ప్రయాణించాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది గూగుల్‌ మ్యాప్స్‌. పాపులర్‌ అయిన ఈ యాప్‌ తన సేవల్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే వాట్సప్ అవసరం లేకుండానే రియల్‌ టైమ్‌ లొకేషన్‌ షేరింగ్‌, ఫ్యూయెల్​ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్‌ మ్యాప్స్‌.. తాజాగా లాక్‌ స్క్రీన్‌పైనే లొకేషన్‌ కనిపించే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది.

తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్నా, షార్ట్‌కట్‌ రూట్స్‌లో ప్రయాణించాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది గూగుల్‌ మ్యాప్స్‌. పాపులర్‌ అయిన ఈ యాప్‌ తన సేవల్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే వాట్సప్ అవసరం లేకుండానే రియల్‌ టైమ్‌ లొకేషన్‌ షేరింగ్‌, ఫ్యూయెల్​ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్‌ మ్యాప్స్‌.. తాజాగా లాక్‌ స్క్రీన్‌పైనే లొకేషన్‌ కనిపించే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది. సాధారణంగా గూగుల్‌ మ్యాప్స్‌లో మనం వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను అందిస్తే సమయం, షార్ట్‌కట్‌లు కనిపిస్తాయి. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో మొబైల్‌ లాక్‌ స్క్రీన్‌పై ఈటీఏ estimated time of arrival, వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్‌ ప్రత్యక్షమవుతాయి. అంటే ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగించాలంటే ప్రత్యేకంగా ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు. ఏదైనా లొకేషన్‌కు సంబంధించిన వివరాలు ఎంటర్‌ చేయగానే.. స్టార్ట్‌ బటన్‌ క్లిక్‌ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే రూట్‌లో ప్రయాణిస్తుంటే.. ఆటోమేటిక్‌గా రూట్‌ అప్‌డేట్‌ అవుతుంది. గూగుల్‌ మ్యాప్స్‌లో గ్లాన్సబుల్‌ ఫీచర్‌ డీఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలంటే.. యాప్‌ ఓపెన్‌ చేసి పైన కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్‌ చేయండి. అందులో కనిపించే సెట్టింగ్స్‌ను ఎంచుకొని కిందకు స్క్రోల్‌ చేయగానే నావిగేషన్‌ సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో కిందకు స్క్రోల్‌ చేస్తే Glanceable directions while navigating’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on