యాప్‌ ద్వారా ఫుడ్‌, లిక్కర్‌ ఫ్రీ ఆఫర్‌ !! ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా ??

యాప్‌ ద్వారా ఫుడ్‌, లిక్కర్‌ ఫ్రీ ఆఫర్‌ !! ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా ??

Phani CH

|

Updated on: Jul 15, 2022 | 9:50 AM

ఆఫర్‌లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటేనే చాలు జనాలు ఎగబడతారు. అలాంటిది ఉచితంగా ఆహారం, మందు వస్తుంటే ఊరుకుంటారా? ఓ యాప్‌ ద్వారా ఫ్రీగా ఫుడ్‌, లిక్కర్‌ వస్తోందని తెలుసుకుని వందల మంది ఆర్డర్‌ చేశారు.

ఆఫర్‌లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటేనే చాలు జనాలు ఎగబడతారు. అలాంటిది ఉచితంగా ఆహారం, మందు వస్తుంటే ఊరుకుంటారా? ఓ యాప్‌ ద్వారా ఫ్రీగా ఫుడ్‌, లిక్కర్‌ వస్తోందని తెలుసుకుని వందల మంది ఆర్డర్‌ చేశారు. క్షణాల్లోనే కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటంతో నిర్వాహకులు షాకయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. డోర్‌డాష్‌ అనే ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఈ సంఘటన ఎదురైంది. ఆ యాప్‌లో పేమెంట్‌ గేట్‍వే లేకుండానే ఆర్డర్లు బుక‍్కయ్యాయి. ఈ ఆఫర్‌ తెలుసుకున్న పలువురు ఆర్డర్‌ చేయటమే కాదు.. తాము ఉచితంగా పొందామని తమ ఆర్డర్‌ ఫొటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. అందులో టెకిలా వంటి అత్యంత ఖరీదైన లిక్కర్‌ కూడా ఉంది. దీంతో డోర్‌డాష్‌ యాప్‌ ట్విట్టర్‌లో ట్రెడింగ్‌లోకి వచ్చింది. అయితే.. ఈ సమయంలో ఎంత మంది పేమెంట్‌ లేకుండా ఆర్డర్‌ చేశారనేది మాత్రం తెలియరాలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??

పాములా మారుతున్న గొంగళిపురుగు !! వీడియో చూస్తా షాక్

Blood Jewellery: రక్తంతో ఆభరణాలు తయారీ.. అది కూడా మానవుని రక్తం తో !!

బయటకు వెళ్లే హడావుడిలో షూ వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త !!

Published on: Jul 15, 2022 09:50 AM